Keedaa Cola: కీడా కోలా ఏ ఓటీటీలో అంటే..!

తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో బ్రహ్మానందం, చైతన్య రావ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన కీడకోలా సినిమా నవంబర్ 3న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది.

Read More: Keedaa Cola Premieres Talk: విషయం వీక్ – పబ్లిసిటీ పీక్స్..!

చాలా గ్యాప్ తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకి ప్రీమియర్స్ ద్వారా మిశ్రమ స్పందన వస్తోంది. అక్కడక్కడా కామెడీ సీన్లు తప్పించి సినిమా అంతా ల్యాగ్ ఉందని టాక్ వినిపిస్తోంది. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్స్ లో ఆడియెన్స్ చివరి వరకూ కూర్చోబెట్ట లేకపోయిందని తెలుస్తోంది.

- Advertisement -

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోని బ్లాక్ బస్టర్స్ అవుతున్న తరుణంలో ఈ సినిమాకి ప్రీమియర్స్ హెల్ప్ అవ్వకపోగా మైనస్ అయ్యేలా ఉంది రెస్పాన్స్ చూస్తోంటే. మొత్తానికి ప్రమోషన్స్ లో హడావిడి చేసిన తరుణ్ భాస్కర్ ఈ సినిమా ప్రీమియర్స్ లోనే చుక్కెదురైందని చెప్పాలి.

Read More: Keedaa Cola Trailer Talk: కీడా కోలా – మొత్తం గోల గోల..!

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న తరుణ్ భాస్కర్ కి ఈ సినిమాతో హిట్ హ్యాట్రిక్ హిట్ మిస్ అయ్యిందనే చెప్పాలి. ఈ సినిమా రిజల్ట్ తో అయినా తరుణ్ భాస్కర్ యాక్టింగ్ మీద ధ్యాస తగ్గించి పూర్తిగా డైరెక్షన్ మీద కాన్సంట్రేట్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు