Kajol : ఓటీటీ దారిలో..!

బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజోల్ గురించి తెలియని వారుండరు. 1992 లో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కాజోల్, ప్రేక్షకుల టెస్ట్ అనుగూణంగా ఎప్పటి కప్పుడు మంచి సినిమాలు చేస్తూ వచ్చింది. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై సినిమాలతో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాల తర్వాతే, షారుక్ – కాజోల్ జోడీ పై అంచనాలు పెరిగాయి. ఈ కాంబోతో వచ్చిన సినిమాలు అన్నీ కూడా దాదాపు హిట్ అయ్యాయి.

చాలా రోజులు గ్యాప్ తీసుకున్న ఈ జోడీ 2015లో దిల్‌వాలే సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత కాజోల్ రెండేళ్లకు ఒక సినిమా అన్నట్టు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సలామ్ వెంకీ అనే సినిమా చేస్తుంది.

అయితే, ఈ బాలీవుడ్ అగ్ర హీరోయిన్ రూట్ మార్చినట్టు తెలుస్తుంది. సిల్వన్ స్క్రిన్ సినిమాల కంటే, ఓటీటీ బెటర్ అని ఫిక్స్ అయినట్టు ఉంది. అందుకే, తన కెరీర్ లో తొలి సారిగా ఓ వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అయిపోయింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ రానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.

- Advertisement -

అయితే, ఈ వెబ్ సిరీస్ కు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయాలరని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కి ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఫేమ్ సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు