Parampara 2 : గోపీ ’పరంపర‘ కొనసాగుతోంది

హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ పేరు తెచ్చుకుంటున్నారు. గోపీ పాత్రలో నవీన్ చంద్ర నటించిన వెబ్ సిరీస్ పరంపర. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. దీని గురించి నవీన్ చంద్ర కొన్ని విషయాలను పంచుకున్నాడు.

తొలి భాగంతో పాటు సెకండ్ సీజన్ కూడా అప్పుడే స్టార్ట్ చేశామని తెలిపారు. అందుకే ఇంత త్వరగా వస్తుందని అన్నాడు. సెకండ్ సీజన్ లో తన పాత్ర ఇంకా పవర్ ఫుల్ గా ఉంటుందని హింట్ ఇచ్చాడు. ‘ఫస్ట్ సీజన్ లో శరత్ కుమార్ కు ఎక్కువ స్కోప్ ఉండేది. కానీ, సెకండ్ సీజన్ లో శరత్ పై పైచేయి సాధించి, తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరు ప్రతిష్టలను తిరిగి ఇచ్చేందుకు ఓ కొడుకు చేసిన యుద్ధమే ఈ వెబ్ సిరీస్’ అని వివరించాడు.

అలాగే నటుడిగా పేరు తెచ్చే అవకాశాలు ఎక్కడున్నా వదలుకోనని అన్నాడు. ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఏ పాత్రలో కనిపించినా, ప్రేక్షకులు ఆదరించారని తెలిపాడు. ఇప్పుడు పరంపర 2 లో కూడా గోపీ పాత్రను ఆదరిస్తారని చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు