Dil Raju : 8 వారాల తర్వాతే..

టాలీవుడ్ నిర్మాతలు షూటింగ్ లను నిలిపివేసి సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. కాస్ట్ కటింగ్, ప్రొడక్షన్ ఖర్చులు తగ్గింపు, ఓటీటీలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు నిర్మాతలు షూటింగ్ లను నిలిపివేశారు. అయితే కొన్ని రోజుల నుండి షూటింగ్ లు త్వరలోనే ప్రారంభం కానున్నాయని వార్తలు వస్తున్నాయి. అలాగే కొంత మంది హీరోలు కూడా నిర్మాతల సమ్మెను ఖండించినట్లు కూడా తెలుస్తుంది. ఈ పరిణామాల తర్వాత గురువారం నిర్మాతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.

త్వరలోనే సినిమా షూటింగ్ లు తిరిగి ప్రారంభమవుతాయని దిల్ రాజు తెలిపారు. అలాగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్లు వివరించారు. థియేటర్, మల్టీ ప్లెక్స్ లలో తిను బండారాల ధరలు ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అన్ని సమస్యలపై చర్చించినట్టు తెలిపారు. కాస్ట్ కటింగ్, ప్రొడక్షన్ ఖర్చుల తగ్గింపు పై ఫిల్మ్ ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియోషన్ మధ్య ఒక ఒప్పందం జరిగిందని ప్రకటించారు.

అలాగే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న, విడుదల కాబోతున్న సినిమాలు అన్నీ కూడా 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అయితే ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకున్న సినిమలకు ఇది మినహాయింపు ఉంటుందని తెలిపారు. సినీ కార్మికుల వేతనాల సమస్యలపై కూడా చర్చించామని అన్నారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని తెలిపారు. ఈ చర్చలు మరో మూడు, నాలుగు రోజుల్లో ముగుస్తాయని చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు