Butterfly : డైరెక్ట్ ఓటీటీకే

2017 జనవరిలో “శతమానం భవతి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో శర్వానంద్ కు ఎంత మంచి పేరు వచ్చిందో, దాని కంటే కాస్త ఎక్కువ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు వచ్చింది. ఈ సినిమాలో అనుపమ అందానికి యూత్ ఫిదా అయిపోయారు. అందమే కాకుండా, నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.

దీంతో అనుపమ అతి త్వరలోనే స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, అది జరగలేదు. అనుపమ గ్రాఫ్ ఎంత స్పీడ్ గా పెరిగిందో, అంతే స్పీడ్ గా పడిపోయింది. ముఖ్యంగా “రౌడీ బాయ్స్” సినిమా అనుపమ కెరీర్ ను మొత్తం మార్చేసింది. దీని తర్వాత ఈ హీరోయిన్ కు అవకాశాలు భారీగా తగ్గాయి.

ప్రస్తుతం అనుపమ చేస్తున్న “18 పేజీస్” “కార్తికేయ -2” సినిమాలు 2020లోనే ప్రారంభమయ్యాయి. అంటే “రౌడీ బాయ్స్” సినిమా తర్వాత అనుపమకు వచ్చిన సినిమా  “బటర్ ఫ్లై” ఒక్కటి మాత్రమే.

- Advertisement -

థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాను ఘంటా సతీష్ బాబు తెరకెక్కించాడు. సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. జెన్ నెక్ట్స్ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అర్విజ్, గిడియాన్ కట్టా సంగీతాన్ని అందించారు. అయితే బటర్ ఫ్లై థియేట్రికల్ రిలీజ్ కు రావడం కష్టమే అని గత కొద్ది రోజులగా వార్తలు వినిపిస్తోన్నాయి.

ఈ వార్తలను నిజం చేస్తూ, ఈ బటర్ ఫ్లై సినిమాను డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్  లో రిలీజ్ కానుంది. అయితే ఎప్పటి నుండి స్ట్రిమింగ్ అవుతుందో డేట్ మాత్రం రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు