SitaRamam: సెకండ్ లిరికల్ సాంగ్

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘సీతా రామం’. స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సీతా రామం’ నుండి ఇదివరకే రిలీజ్ చేసిన టీజర్, పాటకు మంచి స్పందన వచ్చింది.

మహానటి సినిమా తరువాత తెలుగులో దుల్కర్ చేస్తున్న రెండవ చిత్రమిది. హను రాఘవపూడి తెరకెక్కించిన గత చిత్రం ” పడి పడి లేచే మనసు” ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కాబట్టి ప్రస్తుతం హను నమ్మకాలన్నీ “సీతా రామం” చిత్రం పైన ఉన్నాయి. హను తెరకెక్కిస్తున్న ఈ ప్రేమకథలో దుల్కర్ లెఫ్టనెంట్ రామ్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇందులో మరో ప్రధాన పాత్రలో రష్మిక మందన కూడా నటిస్తోంది.

రీసెంట్ గా “సీతా రామం” నుండి “ఇంతందం దారి మల్లిందా” అనే మరో పాటను విడుదల చేసారు, ప్రస్తుతం ఈ పాటకు మంచి స్పందన లభిస్తుంది. ఈ పాటను ఎస్.పి.బి చరణ్ ఆలపించారు. విశాల్ చంద్రశేఖర్ ట్యూన్ కి కృష్ణ కాంత్ అందించిన సాహిత్యం వినసొంపుగా ఉంది.

- Advertisement -

‘సీతా రామం’ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఏకకాలంలో నిర్మిస్తున్న సీతారామం కు సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్. అదనపు సినిమాటోగ్రఫీ శ్రేయాస్ కృష్ణ అందిస్తున్నారు. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, శత్రు, భూమిక చావ్లా, రుక్మిణి విజయ్ కుమార్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు