Allari Naresh: అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు ” డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!

Allari Naresh: చాలాకాలం అనంతరం సిరీస్ డ్రామాస్ నుంచి బ్రేక్ తీసుకుని మళ్ళీ కామెడీ ట్రాక్ లోకి అడుగు పెట్టాడు అల్లరి నరేష్. అల్లరి నరేష్ కామెడీ ట్రాక్ లోకి అడుగుపెడుతూ చేసిన సినిమానే ఆ ఒక్కటి అడక్కు. యంగ్ హీరోయిన్ ఫరియ అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ మూవీకి దర్శకుడు మల్లి డైరెక్షన్ వహించారు.

ఇక థియేటర్లలో ఓ మోస్తారు దానే ఆడిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధమయ్యింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం ఈనెల మే 31 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

Allari Naresh "Aa Okhti Aadakku" Digital Streaming Date Fix
Allari Naresh “Aa Okhti Aadakku” Digital Streaming Date Fix

ఇక దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ అయితే రాలేదు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా బిగ్బాస్ బ్యూటీ అరియానా , వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ ఓటిటి లో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి. ఒకవేళ ఈ సినిమా కనుక ఓటిటిలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటే నరేష్ తదుపరి చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు