Yash: యశ్19 టైటిల్ అనౌన్స్మెంట్.. గూస్ బంప్స్ షురూ..!

మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి కన్నడ హీరోగా పేరు తెచ్చుకున్న యష్ గురించి గత మూడు సంవత్సరాల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలియదనే చెప్పాలి. కానీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కేజిఎఫ్ సినిమాలను తెరకెక్కించి దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. KGF 1& KGF2 సినిమాలతో ఏకంగా రూ.1500 కోట్లు రాబట్టాడు. ఒక కన్నడ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందని ఎవరు కలలో కూడా ఊహించి ఉండరేమో.. రాఖీ భాయ్ గా యశ్ కొత్త పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
ఇకపోతే యశ్ చివరగా నటించిన కేజీఎఫ్ 2 సినిమా 2022లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ ఇంకో సినిమా ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా తర్వాత ఆయన నుంచి ఎటువంటి సినిమా వస్తుంది అనేది బేతాళ ప్రశ్నగా మారింది. అయితే తన నెక్స్ట్ సినిమా కోసం పాన్ ఇండియా అంతా ఈగర్ గా ఎదురు చూస్తూనే ఉన్నారు. చాలా రోజులు గడుస్తున్నాయి కానీ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. అయితే ఎట్టకేలకు అభిమానుల ఎదురుచూపుకు శుభం కార్డు పలికారనే చెప్పాలి. యశ్ తన 19వ సినిమా అనౌన్స్మెంట్ చేశాడు. ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే గీతూ మోషన్ దాస్ డైరెక్షన్లో తన సినిమాని అనౌన్స్ చేశాడు.
దీనికి “టాక్సిక్” అనే టైటిల్ ని కూడా ప్రకటించడం జరిగింది. టైటిల్ రివీల్ మోషన్ పోస్టర్లో కూడా గన్ పట్టుకొని బియర్డ్ లుక్ లో మళ్లీ రాఖీ భాయ్ లా కనిపించాడు. ఇతర కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే 2025 ఏప్రిల్ 10వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించారు.. అంటే ఈ సినిమా కోసం మరో ఏడాదిన్నర పాటు ఎదురుచూడాల్సిందే.. ఓవరాల్ గా చూసుకుంటే 2022 ఏప్రిల్ 14న కే జి ఎఫ్ 2 రిలీజ్ అవ్వగా 2025 ఏప్రిల్ 10వ తేదీన యశ్ 19వ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మరి అన్ని రోజులు వెయిట్ చేయించి ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి. మొత్తానికైతే మోషన్ పోస్టర్ తో ప్రకటించిన టైటిల్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని చెప్పాలి. ఏది ఏమైనా ఈ సినిమాతో మరో రికార్డు సృష్టించబోతున్నారని మాత్రం స్పష్టం అవుతుంది.
Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు