Maruthi: మళ్ళీ ఆ ప్రభాస్ ను చూపిస్తా

వినోదాత్మకమైన చిత్రాలను తీసి ప్రేక్షకులను మెప్పించడంలో ముందుంటాడు దర్శకుడు మారుతి. “ఈ రోజుల్లో” సినిమా నుండి రీసెంట్ గా రిలీజైన “మంచి రోజులొచ్చాయి” సినిమా వరకు మారుతికి మంచి మార్కులే పడ్డాయి. తన కెరియర్ లో ఇప్పటివరకు డిజాస్టర్ చూడని మారుతి, విక్టరీ వెంకటేష్ మినహా ఇప్పటివరకు మీడియం రేంజ్ ఉన్న హీరోలతోనే సినిమాలను చేసారు.

మారుతి కెరియర్ లో మొదటిసారి పాన్ ఇండియా స్టారైన ప్రభాస్ తో సినిమా చేయబోతున్నారు. బాహుబలి సినిమాతో  ఇండియా మొత్తం సుపరిచితుడైన ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకున్నాడు. సలార్, ఆదిపురుష్ , ప్రాజెక్ట్ కే , స్పిరిట్ ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి.

కానీ ప్రభాస్,మారుతి చేయబోయే సినిమా విషయంలో సరైన క్లారిటీ లేదు.
మారుతి లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన సినిమాతో మళ్ళీ “బుజ్జిగాడు”, “డార్లింగ్” సినిమాల్లో కనిపించిన ఎనర్జిటిక్ ప్రభాస్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాని. ప్రస్తుతం ఆ పనుల్లో మా టీం అంతా ఉన్నామని డెఫినెట్ గా మళ్ళీ ప్రభాస్ ని అలా చూస్తారని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ భారీ స్థాయి సినిమాలు చేసినా,
వింటేజ్ ప్రభాస్ ను చూడలేకపోతున్నామనే వెలితిని మారుతి తీర్చబోతున్నాడు అని కొంతమంది అభిమానుల అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు