Thalaivar169 : రజిని సినిమాకు పవర్ ఫుల్ టైటిల్

అన్నత్తై సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కెరీర్ లో 169 సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ అయిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన “బీస్ట్” సినిమా నిరాశపర్చింది. కానీ, దీని ముందు వచ్చిన “డాక్టర్” సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా హిట్ తోనే నెల్సన్ కు అవకాశాలు వస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రజినీ కాంత్ తో ఛాన్స్ కొట్టేయడానికి కారణం కూడా ఈ “డాక్టర్” సినిమా అనే చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా, రజిని – నెల్సన్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చిన నాటి నుండి, ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఉంటుంది. రజినీ కాంత్ ను నెల్సన్ ఎలాంటి పాత్రలో చూపిస్తున్నాడు. అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజా గా ఈ సినిమా టైటిల్ తో పాటు ఒక పోస్టర్ ను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో వ్రేలాడుతున్న కత్తికి రక్తం మరకలు ఉన్నాయి. రజిని మార్క్ ను చూపించేలా మాస్ పోస్టర్ ను డిజైన్ చేశారు. అలాగే “జైలర్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఈ టైటిల్ ఆకట్టుకుంటోంది. మొత్తంగా ఈ టైటిల్, పోస్టర్ ను చూస్తే, రజినీ కాంత్ రూపంలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు ఒక బిగ్ హిట్ వస్తున్నట్టు తెలుస్తుంది. కాగా, ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు