Vishwak Sen: విశ్వక్ సేన్ “నా అల్లుడు” సినిమాను రీమేక్ చేస్తాడా.?

Vishwak Sen: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ఎన్టీఆర్ ఒకరు. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నాడు. చాలా చిన్న ఏజ్ లోనే ఒక మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ అంటే మాస్ కమర్షియల్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ అని అనిపించుకున్నాడు. అయితే ఒక సందర్భంలో ఎన్టీఆర్ కి వరుసగా ఫెయిల్యూర్ సినిమాలొచ్చాయి . ఇప్పుడు మళ్లీ ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా హిట్ సినిమాలతో జోష్ లో ఉన్నాడు.

Vishwak Sen

ఎన్టీఆర్ అభిమానిగా

అయితే మామూలుగా హీరోలకు అభిమానులు ఉండటం సహజం. కానీ కొంతమంది హీరోలకి హీరోలే అభిమానులు అవుతారు. ఇకపోతే ఎన్టీఆర్ కున్న ఫ్యాన్ బేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్స్ లో విశ్వక్సేన్ ఎంత పెద్ద ఫ్యాన్ అని మనకు తెలిసిందే. విశ్వక్ చేసిన ఒక సినిమాకి చీఫ్ గెస్ట్ గా కూడా హాజరయ్యారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా విశ్వక్సేన్ ఒక ర్యాప్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు.

- Advertisement -

ఆ సినిమా రీమేక్ చేస్తాడట

ప్రజెంట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాను చేస్తున్నాడు విశ్వక్సేన్. ఈ సినిమా 31న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు విశ్వక్. అయితే దీనిలో ఎన్టీఆర్ చేసిన సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా రీమేక్ చేయాలి అనుకుంటే ఏం చేస్తారు.? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నా అల్లుడు అనే సినిమా పేరును చెప్పాడు విశ్వక్సేన్. ఇకపోతే నా అల్లుడు అనే సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే విశ్వక్ ఆ సినిమా గురించి చెప్తున్నాడా లేదంటే ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తున్నాడా అంటూ కొందరికి అనుమానాలు మొదలయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు