Sammathame: హిట్ అందుకుంటాడా.?

“రాజావారు రాణిగారు” సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి పేరు ను సాధించుకున్నాడు కిరణ్ అబ్బవరం.
“SR కల్యాణమండపం” సినిమాతో కేవలం హీరోగానే కాకుండా ఒక రైటర్ గా కూడా తనలోని టాలెంట్ ను నిరూపించాడు.
తను చివరగా చేసిన “సెబాస్టియన్” సినిమాతో నిరాశపర్చిన కిరణ్ ఇప్పుడు “సమ్మతమే” సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.

ఈ సినిమాలో కిరణ్ సరసన చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది.
జూన్ 24 న సమ్మతమే రిలీజ్ కానున్న సంధర్బంగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

తన చిన్నప్పుడు నుంచి పెళ్లి కోసం ఎదురు చూసే డీసెంట్ యువకుడిగా కిరణ్ అబ్బవరం సెటిల్డ్ రోల్ లో కనిపిస్తున్నాడు.
ట్రైలర్ చూస్తుంటే కిరణ్, చాందిని చౌదరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది అనిపిస్తోంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ తో, ఇంకొన్ని ఫన్నీ డైలాగ్స్ తో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది సమ్మతమే ట్రైలర్.

- Advertisement -

3 మిలియన్ పైగా వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. గోపినాధ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ అందుకుని కిరణ్ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో లేదో తెలియాలి అంటే జూన్24 వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు