Sabdham : స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వబోతున్న ఆది?

Sabdham : కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు వాడైన ఆది ముందు తెలుగులోనే పరిచయమైనా క్లిక్ అయింది మాత్రం తమిళ్ లోనే. 2009లో వచ్చిన వైశాలి సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆది తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అది పినిశెట్టి హీరోగా అరివళగన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఆ తర్వాత ఆది పలు సినిమాల్లో నటించినా హిట్లు దక్కలేదు. చివరగా తొమ్మిదేళ్ల కింద మలుపు సినిమాతో హిట్టు కొట్టిన ఆది మళ్ళీ ఆ స్థాయిలో హిట్టు కొట్టలేదు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో, ప్రతినాయకుడి పాత్రల్లో కూడా నటించాడు. రంగస్థలం లో రామ్ చరణ్ అన్న కుమార్ బాబు గా మంచి పేరు తెచ్చుకున్న ఆది, సరైనోడు, వారియర్ లాంటి సినిమాల్లో విలన్ గానూ భయపెట్టాడు. అయితే ఆది మళ్ళీ హీరో గా చాలా రోజులుగా సక్సెస్ కొట్టలేదు. ఇక తాజాగా ఆది హీరోగా శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

వైశాలి కాంబోలో..

ఆది హీరోగా తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న వైశాలి దర్శకుడు అరివళగన్ తో మళ్ళీ శబ్దం సినిమా చేస్తున్నాడు. ఇన్నాళ్ళకు మళ్ళీ వారి కాంబినేషన్‌లో శబ్దం అనే సినిమా రాబోతుండగా ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. వైశాలి లాగా సూపర్‌ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌ గానే మరో థ్రిల్ మూవీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.తాజాగా విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా, టీజర్‌తో సినిమాలోని అదిరిపోయే సెటప్‌ తో ఆసక్తిని కలిగించింది. టీజర్ లో ఆది పినిశెట్టి ఒక హాంటెడ్ హౌస్ వద్ద కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగేటప్పుడు కొన్ని విచిత్రమైన శబ్దాలను రికార్డ్ చేయడం కనిపిస్తుంది. ఇక అసలు విషయాలను రివీల్ చేయకుండా, టీజర్‌లో సినిమాలోని ప్రముఖ నటీనటులందరినీ చూపించారు. దాని వల్ల సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది. దర్శకుడు అరివళగన్ ఈసారి సౌండ్ తో ఆత్మలకు సంబంధించిన పాయింట్ ను విభిన్నంగా తెరపైకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థమన్ తన పని తనాన్ని చూపించగా, ఇలాంటి హర్రర్ థ్రిల్లర్‌లలో మ్యూజిక్ కీలకం కాబట్టి, ఇక థమన్ కు ఇదొక మంచి ఛాలెంజింగ్ మూవీ అని చెప్పవచ్చు.

శబ్దం తో కం బ్యాక్ ఇచ్చేలా..

ఇక ఇంతకు ముందు వైశాలిలో వాటర్ ద్వారా ఆత్మ కి కనెక్షన్ ని చూపించగా, శబ్దం (Sabdham) సినిమాలో వాయిస్ తో ఆత్మల కనెక్షన్ ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సౌండ్‌కి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉండనున్నాయి. ఈ సినిమాలో సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 7G ఫిల్మ్స్ శివ మరియు ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, S. బానుప్రియ శివ సహ నిర్మాతగా ఉన్నారు. జాతీయ అవార్డు గ్రహీత సాబు జోసెఫ్ ఈ సినిమాకు ఎడిటర్ కాగా, త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. ఇక గత కొంత కాలంగా హీరోగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న ఆది ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక శబ్దం సినిమాను తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు