Major : సందీప్ బయోపిక్కే ఎందుకు..?

2011 వ సంవత్సరంలో ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ ఉగ్రదాడిలో చాలా మంది అమాయక ప్రజలు మరణించారు. అలాగే పలువురు సైనికులు కూడా వీరమరణం పొందారు. కానీ, ఇందులో కేవలం సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్రతో ‘మేజర్’ అనే చిత్రాన్ని రూపొందించారు. మరి చనిపోయిన మిగిలిన సైనికుల కథల్ని ఎందుకు సినిమాగా మార్చలేదు.. ఇదే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో మెదులుతుంది. నిజానికి ముంబై దాడుల నేపథ్యంలో ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ అనే చిత్రాన్ని రాంగోపాల్ వర్మ తెరకెక్కించాడు. ఆ సినిమాలో కళ్ళకు కట్టినట్టు జరిగినదంతా చూపించాడు. కసబ్ ను పట్టుకుంటూ మరణించిన సోల్జర్ కూడా ఒకరున్నారు. మరి అలాంటి వాళ్ళ బయోపిక్ ఎందుకు తీయలేదు అని చాలా మంది చర్చించుకుంటున్నారు.

ఇదే ప్రశ్న దర్శకుడు శశికిరణ్ ను అడిగితే.. “శేష్ కు సందీప్ పాత్ర బాగా నచ్చింది. ఆ పాత్రకి బాగా కనెక్ట్ అయ్యాడు” అని సమాధానం ఇచ్చి సరిపెట్టాడు. మరి మిగిలిన సైనికుల పాత్రలు ఏ హీరోకి కనెక్ట్ అవుతుందో..వాళ్ళ జీవితాలతో సినిమాలు ఎప్పుడు రూపొందుతాయో తెలియాల్సి ఉంది. ఇక ‘మేజర్’ చిత్రం ఈ రోజు పాన్ ఇండియా రేంజ్ లో విడదల అయింది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి జోష్ లో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు