Panja Vaisshnav Tej : మెగా మేనల్లుడిపై ఎందుకంత నమ్మకం ?

ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. వెంటనే క్రిష్ లాంటి వైవిధ్యభరితమైన సినిమాలు తీసే దర్శకుడితో పనిచేసే అదృష్టం వైష్ణవ్ తేజ్ కి దక్కింది. ఎంతగానో నమ్మి “సన్నపు రెడ్డి వెంకటరామిరెడ్డి” రాసిన కొండపోలం పుస్తకాన్ని దర్శకుడు క్రిష్ సినిమాగా తెరకెక్కించాడు. కానీ ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు కలిగిన అనుభూతి ఆ సినిమాను చూస్తున్నప్పుడు కలగలేదు అనేది చాలామంది అభిప్రాయం. అలా ఒక రకంగా వైష్ణవ్ తేజ్ కి “కొండపోలం” సినిమా కొంత నిరాశనే మిగిల్చింది.

వైష్ణవ్ మొదటి సినిమా “ఉప్పెన” హిట్ అయినా కూడా ఆ క్రెడిట్ ఎక్కువశాతం క్రితి శెట్టి కి దక్కిందని చెప్పొచ్చు. బేబమ్మ పాత్రలో కనిపించిన క్రితి, కుర్రకారుకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం నాగ చైతన్య, నాని , సుధీర్ బాబు , రామ్ పోతినేని, నితిన్ లాంటి యంగ్ హీరోస్ తో జతకట్టింది బేబమ్మ .

వైష్ణవ్ కి హీరోగా ఒక ప్రోపర్ ఎస్టాబ్లిషమెంట్ లేకపోయినా అవకాశాలు మాత్రం దండిగా వస్తున్నాయి, ఆ అవకాశాలు కూడా అగ్రనిర్మాణ సంస్థలు నుంచి వస్తున్నాయి. దానికి కారణం వైష్ణవ్ లోని టాలెంట్ ను రేపటితరం దర్శకులు గుర్తించడం కావచ్చు. అలానే లాంచింగ్ సినిమా అంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా భీభత్సమైన హడావిడి, ఎంట్రీ సీన్స్ లాంటివి లేకుండా కేవలం కథను నమ్మి మొదటి సినిమా ఉప్పెన లోనే ఆ పాత్రను చేయడం వలన, వైష్ణవ్ డైరెక్టర్స్ హీరో అని చాలామంది నిర్మాతలకి నమ్మకం రావడం కూడా వైష్ణవ్ అవకాశాలకి ఒక కారణం కావొచ్చు.

- Advertisement -

ఏది ఏమైనా ఈ యంగ్ హీరో ప్రస్తుతం “రంగ రంగ వైభవంగా” సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అలానే శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో PVT04 సినిమాను చేయబోతున్నట్లు ఈ రోజు అధికారికంగా అనౌన్స్ చేసారు. ఈ సినిమాలో వైష్ణవ్ సరసన శ్రీలీలా నటించనుంది.
ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు