Sankranthi Race : పొంగల్ పోరు !

ప్రతి ఏడాది సంక్రాంతికి కోళ్ల మధ్య మాత్రమే కాదు, ఇండస్ట్రీలో హీరోల మధ్య కూడా పోరు ఉంటుంది. చిన్న హీరోల నుండి అగ్ర హీరోల వరకు తమ సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తుంటారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా కోళ్ల పందెలు, సినిమా పందెలు పెద్దగా జరగలేదు. కానీ, వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాలు నిలవడానికి రెడీ అవుతున్నాయి. సంక్రాంతికి ఇంకా ఆరు నెలల సమయం ఉన్నా, అప్పుడే ఆ వేడి ఇండస్ట్రీలో కనిపిస్తోంది.

Bhola Shankar for Sankranthi

సంక్రాంతి రేసులో బాలయ్య-చిరంజీవి మధ్య పోరు అందరిని ఆకర్షిస్తుంది. ఈ అగ్ర హీరోలు మొదటగా మంగమ్మ గారి మనవడు, ఇంటిగుట్టు సినిమాల ద్వారా బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరూ దాదాపు 18 సార్లు బాక్సాఫీస్ ముందు సై అన్నారు. 2017లో సంక్రాంతి టైంలో ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి, గౌతమిపుత్ర శాతకర్ణితో బాలయ్య పోటీలో నిలిచారు. రసవత్తంగా సాగిన ఈ పోరులో చివరికి మెగాస్టార్ పై చేయి సాధించాడు. ఈ అగ్ర హీరోలు మరోసారి బాక్సాఫీస్ ముందు ఢీ కొట్టుకోవడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

- Advertisement -

NBK107 movie in the Sankranthi race

భోళా శంకర్ సినిమాతో చిరంజీవి, NBK107తో బాలయ్య వచ్చే ఏడాది పొంగల్ పోరకు సై అంటున్నట్టు సమాచారం. ఇది నిజమే అయితే, మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ కు పండగా వాతావరణమే అని చెప్పొచ్చు. భారీ అంచనాలతో వస్తున్న ఈ రెండు సినిమాలకు సంక్రాంతి పోరులో టాప్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Varasudu In sankranthi Race

ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో సినిమా ఉండాలని బలంగా ప్రయత్నించే దిల్ రాజు, ఈ ఏడాది కూడా తన సినిమాను పోటీలో ఉంచడానికి సిద్ధమవుతున్నాడు. ముందుగా రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో వస్తున్న RC15 సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నట్టు తెలుస్తుంది. కానీ, అనూహ్యంగా విజయ్-వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం వారసుడు రేసులోకి వచ్చింది. విజయ్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దీనికి తోడు టాలీవుడ్ డైరెక్టర్ యే దర్శకత్వం వహించడంతో ప్లస్ గా మారనుంది.

hari hara veera mallu in Sankranthi race

దీంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు సినిమా కూడా సంక్రాతి పోరులో నిలుస్తున్నట్టు సమాచారం. నిజానికి ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉంది. కానీ, పవన్ డేట్స్ సరిగ్గా ఇవ్వలేకపోవడంతో షూటింగ్స్ బ్రేక్ పడుతూ వచ్చింది. దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే చిరుకు పోటీగా పవన్ వెళ్తాడా లేదా అన్నపై గౌరవంతో సంక్రాంతి బరిలో నుండి తప్పుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.

Adipurush In Sankranthi race

అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా సంక్రాంతి పోరుకు రెడీ అయిపోయారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓ రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని, మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలనే నెలకొల్పాయి. ఈ సినిమాతో ప్రభాస్ సంక్రాంతికి గట్టి పోటీ ఇవ్వనున్నాడు.

ఈ సినిమాలతో పాటు పుష్ప పార్ట్ 2 కూడా సంక్రాంతి బరిలో ఉండాల్సింది. కానీ, ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో, సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

పుష్ఫ కాకుండా ఇప్పటి వరకు 5 సినిమాలను సంక్రాంతి రేసులో ఉంచడానికి ఆయా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్ని సినిమాలు ఉన్నా, సంక్రాంతి బాస్ గా ఒక్క సినిమానే పరిగణిస్తారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి బాస్ ఎవరంటే, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు