రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ రకంగా ప్రభాస్ కు స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టిన సినిమా ఇది. 2005 లో ఈ చిత్రం విడుదలైంది. దాదాపు 17 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అయితే ఈ చిత్రంతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. దీని కోసం వి.వి.వినాయక్ ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుండి చిత్ర బృందానికి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. మొదట ఈ చిత్రం కోసం వేసిన సెట్ వర్షాల వల్ల కూలిపోయింది. దీంతో నిర్మాతలు 3 కోట్ల మేర నష్టపోయారు. హీరోయిన్ ను ఎంపిక చేసుకోవడానికి చాలా టైం పట్టింది.
అనేక అడ్డుంకులను ఎదుర్కొని షూటింగ్ ను దాదాపు పూర్తి చేసినట్టు సమాచారం. కానీ, ఇప్పటివరకు సినిమా రిలీజ్ కాలేదు. అందుకు కారణం ఏంటి అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా జరుగుతోంది. అసలు విషయం ఏంటంటే, ఈ చిత్రానికి డబ్బింగ్ పనులు పూర్తి చేయడం దర్శకుడు వినాయక్ కు చాలా కష్టంగా మారిందట. దీనికి కారణం వివి వినాయక్ కు హిందీ పెద్దగా రాకపోవమే అని టాక్. అలాగే ఈ చిత్రానికి టైటిల్ కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదట. ఛత్రపతి , శివాజీ తో పాటు మరికొన్ని టైటిల్స్ ను పరిశీలనలో ఉన్నట్టు టాక్. మరి ఫైనల్ గా ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారు. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు అనేది మాత్రం క్లారిటీ రాలేదు.