Megastar- Maruthi Film: ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా.?

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రధముడు అని చెప్పొచ్చు. ఏ కొత్త సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నా వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవుతుంటారు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రమే కాకుండా కొన్ని రియాలిటీ షోస్ కి కూడా హాజరవుతుంటారు. గతంలో బిగ్ బాస్ షోకి హాజరైన మెగాస్టార్ తన కామెడీ టైమింగ్ తో తనదైన శైలిలో అలరించారు. రీసెంట్ గా ఓటిటి ప్లాట్ ఫ్రామ్ అయిన ఆహా లో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్ షోలో కూడా అదే ఎనర్జీతో అలరించారు.

మెగాస్టార్ ఏదైనా ఒక ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆయా నటీనటులు గురించి, సాంకేతిక నిపుణులు గురించి తెలుసుకుని మాట్లాడుతుంటారు. అంతా బాగానే ఉన్నా, మెగాస్టార్ కొన్ని సందర్బాల్లో బహిరంగంగా తన ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేస్తుంటారు. కానీ అవి పట్టాలెక్కిన సందర్భాలు చాలా తక్కువ. గతంలో అమితాబ్ బచ్చన్ సమక్షంలో మెగాస్టార్150వ సినిమాను దర్శకుడు పూరిజగన్నాథ్ తో చేయబోతునట్లు ప్రకటించారు, వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. కానీ ఈ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కడం పక్కన పెడితే వీటి గురించి ప్రస్తావన కూడా లేదు.

తాజాగా “పక్కా కమర్షియల్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన మెగాస్టార్ మారుతి తో సినిమాను చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన మెగాస్టార్, మారుతి తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తారా.? లేదా గతంలో వాటిలాగే దీని గురించి కూడా ప్రస్తావన లేకుండా వదిలేస్తారా అని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు