రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రెస్
పచ్చిగా చెప్పాలి అంటే ఇంటి మీద రాయి వేసి వీపు కాసే టైపు.
అర్ధవంతమైన ప్రశ్నలకు అర్ధంకాని సమాధానాలు ఇవ్వడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య , కొన్నిసార్లు వేదంతిలా మాట్లాడటం ఇంకొన్ని సార్లు తిక్క సమాధానాలు ఇవ్వడం ఈయన శైలి.
రీసెంట్ గా ఆయన దర్శకత్వం వహించిన “మా ఇష్టం” సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సందర్బంగా ఆయనను అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానం ఇచ్చారు.
మా ఇష్టం సినిమాతో ప్రేక్షకులకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు.?
ఏమి చెప్పాలి అనుకోవట్లేదు చూపించాలి అనుకుంటున్నా.
మీ సినిమాలు సమాజానికి ఏమైనా నేర్పిస్తాయా.?
సమాజానికి నేను ఎప్పుడు ఏమి చెయ్యలేదు చెయ్యను కూడా.
నాలుగు గోడలు మధ్య జరిగేది సంసారం, బయట జరిగేది వ్యభిచారం అంటారు,మీరు దేనికి ఎక్కువ విలువ ఇస్తారు.?
వ్యభిచారానికి ఎక్కువ విలువ ఇస్తా, సంసారం నాకు బోర్ ఇంట్లో కూర్చుని వంట చేయడం, ఇది చెయ్యడం, అది చెయ్యడం అవన్నీ బోర్.
నేను కూడా వ్యభిచారినే ఎందుకంటే నాకున్న టాలెంట్ ను అమ్ముతున్నాను నేను, మనలో ఉన్న ప్రతి ఒక్కడు చేసేది వ్యభిచారమే. వ్యభిచారం అంటే “నత్తింగ్ బట్ సెల్లింగ్ వాట్ యు ఆర్ వర్త్ ఇట్ ఈజ్”
ప్రస్తుత రాజకీయాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది.?
రాజకీయాలు చూడను నేను. నేను అసలు పట్టించుకోను, ఒకేవేళ రాజకీయ నాయకులు బూతులు తిడితే చూసి ఎంజాయ్ చేస్తాను అంతే.
సినిమాలు ఎందుకు తీస్తున్నారు సర్.?
బ్రేక్ ఫాస్ట్ కి లంచ్ కి మధ్య పని ఏమి లేదు కాబట్టి సినిమాలు తీస్తున్న.
యువత రాజీకీయాల్లోకి రావాలి అంటారా.?
ఎవడు రావాలి , వద్దు అని చెప్పడానికి నేను ఎవడు అసలా.?