Mohana Indraganti : ఆ సినిమా ఏమైపోయినట్టు?

ఇంద్రగంటి మోహనకృష్ణ, ప్రేమకథా చిత్రాలను సరికొత్తగా ప్రజెంట్ చేయడంలో సిద్ధహస్తుడు. ‘అష్టా చమ్మా’ ‘అంతకు ముందు ఆ తరువాత’ ‘సమ్మోహనం’ వంటి చిత్రాలను మలిచిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ‘జెంటిల్ మన్’ చిత్రాన్ని తన శైలికి భిన్నంగా థ్రిల్లర్ మూవీలా తీర్చిదిద్దాడు. అయినా, హిట్ అందుకున్నాడు ఇంద్రగంటి. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ‘వి’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. కానీ అది ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో మళ్ళీ బ్యాక్ టు లవ్ స్టోరీస్ అంటూ వెనక్కి వచ్చాడు. సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.

‘ఉప్పెన’ ‘శ్యామ్ సింగ రాయ్’ ‘బంగార్రాజు’ సినిమాల సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న కృతి శెట్టి హీరోయిన్ కావడంతో మంచి బజ్ ఏర్పడింది. టీజర్ కూడా ఆకట్టుకుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. కానీ ఈ చిత్రం తర్వాత కృతి శెట్టి ఒప్పుకున్న ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలు అప్పుడే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు కూడా రెడీ అయిపోయాయి. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఇంకా ఎందుకు విడుదల కావడం లేదు అనే చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు