Viva Harsha: బాడీ షేమింగ్ పై వైవా హర్ష షాకింగ్ కామెంట్స్..?

మొదట యూట్యూబ్ ,టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు వైవా హర్ష.. దీంతో పలు సినిమాలలో కూడా కమెడియన్ గా నటిస్తూ భారీ గానే క్రేజ్ సంపాదించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా , కమెడియన్ గా నటిస్తూనే మెల్లమెల్లగా హీరోగా కూడా పలు సినిమాలలో నటించే స్థాయికి చేరిపోయారు వైవా హర్ష. తాజాగా సుందరం మాస్టర్ అనే సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్లో రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హర్ష ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీ అయిపోయారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఛానల్ తో మాట్లాడిన హర్ష.. తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా తెరపై కామెడీతో ఆడియన్స్ ని నవ్వించే ఈయన గతంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. తన జీవితంలో జరిగిన చేదు సంఘటనల గురించి కూడా గుర్తు చేసుకున్నారు. డబ్బుల కోసం ఇష్టం లేని పాత్రలలో కూడా నటించాల్సి వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యారు వైవా హర్ష.

చిన్నప్పుడు తాను ఆస్తమా వ్యాధితో బాధపడే వాడిని.. అది తగ్గడం కోసమే స్టెరాయిడ్స్ కూడా ఇచ్చారు.. దానివల్ల చాలా బరువు పెరిగి పోయాను.. స్కూల్ డేస్ సమయంలోనే చాలా బొద్దుగా ఉండడంతో నా స్నేహితులు కూడా నన్ను చాలా హేళన చేసే వారు.. చాలా నీచమైన కామెంట్లు కూడా చేసేవారు… అంతేకాదు నా తల్లిదండ్రులతో కలిసి ట్రైన్ లో ప్రయాణించాలన్న కూడా చాలా భయపడే వాడిని… ఎందుకంటే నా ముందు సీటు వాళ్ళు వెనుక సీటు వాళ్ళు నన్ను చూసి నవ్వుకునే వాళ్ళు.. అంతేకాదు ఎన్నోసార్లు నల్లగా బొద్దుగా ఉన్నానని ఏడిపించే వారంటూ తెలిపారు.

- Advertisement -

ఇండస్ట్రీలో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ కలర్ ఫోటో సినిమాకు ముందు వరకూ.. తాను ఇండస్ట్రీకి వచ్చినా ఏం చేస్తున్నారనే ఫీలింగ్ తనలో ఉండేదని..EMI కట్టాల్సిన పరిస్థితులలో కొన్ని ఇష్టం లేకపోయినా సరే పిచ్చి పిచ్చి పాత్రలలో నటించానని.. తనకు నచ్చని పాత్రలను కూడా నవ్వుతూ నటించాల్సి వచ్చిందంటూ అది చాలా కష్టమని మాటలలో చెప్పలేనంత ఇబ్బంది అంటూ తెలిపారు. వీటితోపాటు సినిమా షూటింగ్ సెట్లో కూడా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి . తన కలర్ బాడీ లాంగ్వేజ్ గురించి కూడా చాలామంది జోకులు వేశారని కేవలం డబ్బు కోసమే అవన్నీ భరించానని తెలిపారు. కలర్ ఫోటో సినిమా తనలో ఒక కాన్ఫిడెంట్ తెచ్చింది అంటూ తెలిపారు వైవా హర్ష.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు