యాక్షన్ కింగ్ అర్జున్
ప్రస్తుతం కొన్ని పాత్రలకి మాత్రమే పరిమితం అయ్యారు కానీ ఒకప్పుడు ఈయన సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చేవాళ్ళు.
హీరోలు దర్శకులు అవ్వడం , నటులు దర్శకులు అవ్వడం , కొరియోగ్రాఫర్స్ దర్శకులు అవ్వడం మనం ఇప్పటివరకు చూస్తూనే వచ్చాము.
అందులో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఒకరు,
ఆయన 1994లో తీసిన జైహింద్ అప్పట్లో తమిళ తెలుగు రెండు భాషల్లోనూ సూపర్ హిట్. 2002లో బాలకృష్ణ నరసింహనాయుడుని అక్కడ ఎజుమలై పేరుతో రీమేక్ చేసి తనే దర్శకత్వం వహించారు. దాన్నే తిరిగి సింహబలుడు పేరుతో డబ్బింగ్ చేసి వదిలారు.
ఇదివరకు వివిధ భాషల్లో దర్శకుడిగా సినిమాలు చేసిన అర్జున్ ఇప్పుడు తెలుగులో కూడా సినిమాను చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే విడుదలైన అశోకవనంలో అర్జున కళ్యాణంతో డీసెంట్ సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్ త్వరలో యాక్షన్ కింగ్ అర్జున్ డైరక్షన్ లో నటించబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ గురించి వార్తలు వినిపించడమే తప్ప అధికారిక ప్రకటన లేదు.