Cult : “కల్ట్” కాంట్రవర్సీ… టైటిల్ కోసం తగాదా

Cult : ఇండస్ట్రీలో సినిమా కథలు, టైటిల్ లకు సంబంధించిన వివాదాలు తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి సంఘటన టాలీవుడ్ లో చోటు చేసుకుంది. విశ్వక్ సేన్, “బేబీ” మూవీ నిర్మాత ఎస్కేఎన్ మధ్య “కల్ట్” కాంట్రవర్సీ మొదలైంది. మరి ఈ రచ్చకు కారణం ఏమిటి అనే వివరాల్లోకి వెళితే…

యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ తో మీడియా ముందుకు వచ్చాడు. తన సొంత బ్యానర్లు వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకంపై నిర్మించబోతున్న తన లేటెస్ట్ మూవీకి “కల్ట్” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా ప్రకటించాడు. “లైక్ ఎ లీప్ ఇయర్ 2024” అనే టాగ్ లైన్ తో టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీకి తాజుద్దీన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారానే విశ్వక్ తన ప్రొడక్షన్ హౌస్ విశ్వక్ సేన్ సినిమాస్ ప్రొడక్షన్ ను కూడా లాంచ్ చేస్తున్నాడు.

ఈ సందర్భంగా తాజాగా జరిగిన మీడియా సమావేశంలో విశ్వక్ మాట్లాడుతూ ఈ సినిమా కథను తానే రాసుకున్నానని, తాజుద్దీన్ అనే దర్శకుడిని, 25 మంది కొత్త నటులను ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నానని చెప్పుకొచ్చాడు. కానీ కొన్ని రోజుల క్రితం ఇదే టైటిల్ తో బేబీ నిర్మాత ఎస్కేఎన్ సినిమాను ప్రకటించడంతో ఇప్పుడు వివాదం మొదలైంది.

- Advertisement -

నిజానికి ఎస్కేఎన్ నిర్మించిన “బేబీ” మూవీ ఈ ఏడాది అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సమయంలోనే “కల్ట్ బొమ్మ” అనే పదం బాగా వైరల్ అయింది. క్యాచీగా ఉన్న ఈ పదాన్ని తన నెక్స్ట్ మూవీ టైటిల్ గా రిజిస్టర్ చేయించుకున్నట్టు ఎస్కేఎన్ చాలా రోజుల కిందటే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా అదే టైటిల్ తో విశ్వక్ సేన్ కూడా ప్రకటించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇదే విషయాన్ని విశ్వక్ సేన్ దగ్గర ప్రస్తావిస్తూ ప్రశ్నించగా ఆయన #Cult, “కల్ట్ బొమ్మ”కు సంబంధించిన టైటిల్, హాష్ ట్యాగ్ ఎవరు రిజిస్టర్ చేయించలేదని, అందుకే తాను తన సినిమా కోసం ఈ టైటిల్ను రిజిస్టర్ చేయించుకున్నాను అని వెల్లడించారు.

ఇక ఇదే విషయం ఎస్కేఎన్ దృష్టికి వెళ్లడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ “కల్ట్ బొమ్మ టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయకుండానే ప్రకటించారా అని చాలామంది అడుగుతున్నారని, “కల్ట్ బొమ్మ” టైటిల్ బేబీ సినిమా ప్రమోషన్ల నుంచే బాగా పాపులర్ అయిందని, దీంతో ఆ టైటిల్ ని కొన్ని నెలల క్రితమే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో నా నెక్స్ట్ తెలుగు మూవీ కోసం రిజిస్టర్ చేసుకున్నాం అని, టైటిల్ను రిజిస్టర్ చేయకుండా ఎలాంటి ప్రకటన చేయలేము” అంటూ క్లారిటీ ఇచ్చారు.

దీంతో ఈ రచ్చ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. టైటిల్స్ లో చిన్న డిఫరెన్స్ ఉన్నప్పటికీ దాదాపుగా ఒకే టైటిల్ తో సినిమాలు రిలీజ్ అయితే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మరి. కాగా బేబీ సినిమా ఆఫర్ ని ముందుగా డైరెక్టర్ సాయి రాజేష్ విశ్వక్ సేన్ తో చేయాలని అనుకున్నారట. కానీ ఆయన రిజెక్ట్ చేశాడనీ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు