Vishnupriya : నేను బాధితురాలునే !

యాంకర్ విష్ణుప్రియ.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు పొందిన విష్ణుప్రియ, ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గాను సత్తా చాటుతోంది. రానా దగ్గుబాటి హోస్ట్ గా చేసిన ‘నంబర్ వన్ యారి’ షోకు విష్ణుప్రియ సహాయకురాలిగా చేసింది. దీని తర్వాత విష్ణుప్రియ బుల్లితెరపై పలు షోలలో కనిపించింది. అలాగే హాట్ హాట్ ఫోటోషూట్స్, పొట్టి బట్టలతో డాన్స్ చేస్తూ తరచు వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తరుచూ హంగామా చేస్తుంది. షోలు చేస్తున్నా.. చేయలేని సందర్భాలు ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. కెరీర్ కు సంబంధించి విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంది. అలాగే, కెరీర్ కు సంబంధించిన విషయాలు కూడా చెబుతుంది.

అంతేకాదు అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారిపోతుంది. తన అందాలను ఆరబోస్తూ, నెటిజెన్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ మధ్య ‘జరీ జరీ’ ఆల్బమ్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సాంగ్ లో ఈమె, టాప్ టు బాటమ్ అందాల విందు చేసింది. ఆ డ్యాన్స్ కి తోడు విష్ణుప్రియ గ్లామర్, వీడియోని మళ్లీమళ్లీ చూసేలా చేసింది. ఇక ఈ సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుప్రియ, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయిపోయింది.

కాస్టింగ్ కౌచ్ కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే లేదని చెప్పింది. ప్రతి రంగంలోనూ మహిళలకు ఇబ్బందులు తప్పట్లేదని పేర్కొంది. తను కూడా ఛాన్స్ ల కోసం ప్రయత్నిస్తే, కోరిక తీరుస్తావా అని కమిట్ మెంట్స్ అడిగారని తెలిపింది. వాటికి నో చెప్పి సదరు అవకాశాల్ని వదిలేసుకున్నానని అసలు విషయాన్ని రివీల్ చేసింది. ఇక విష్ణుప్రియ చేసిన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు