దగ్గుబాటి రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’.’సురేష్ ప్రొడక్షన్స్’, ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ల పై సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా మహమ్మారి వల్ల అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, ఎట్టకేలకు జూన్ 17న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. కొన్నిసార్లు ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కాబోతుంది అనే టాక్ కూడా నడిచింది. నిజానికి ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు లేవు. ప్రమోషన్స్ కు కూడా పెద్దగా చేయలేదు. కానీ, ఇటీవల వచ్చిన ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇదిలా ఉండగా.. ‘విరాట పర్వం’ చిత్రం రానా ఎందుకు ఓకే చేసాడో తనకు ఇంకా తెలియదని దర్శకుడు వేణు అంటున్నాడు. ఈ కథని ఆయన ముందుగా సురేష్ బాబుకి వినిపించారట. సురేష్ బాబుకు నచ్చి ఆ లైన్ ను రానాకు వినిపించారట. రానాకు కూడా లైన్ నచ్చడంతో తనతో పూర్తి కథను తెలుసుకుని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పాడు డైరెక్టర్ వేణు. ఈ స్టోరీలో హీరోయిన్ ప్రాముఖ్యత ఎక్కువ ఉండటంతో రానా ఒప్పుకుంటారా.. అని వేణు అనుకున్నారట. కానీ రానా ఈ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని విరాట పర్వం డైరెక్టర్ వేణు ఉడుగుల ఓ సందర్భంలో మీడియా ముందు చెప్పాడు.