Vijayendra Prasad, Ilayaraja : పెద్దల సభలో సినీ పెద్దలు

టాలీవుడ్ లో ప్రముఖ రచయిత, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అలాగే సినీ పరిశ్రమ నుండి సంగీత దర్శకుడు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
రాష్ట్రపతి కోటాలో ఈ సినీ దిగ్గజాలను రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

వివిధ రంగాల్లో కొన్ని దశాబ్దాల నుండి సేవలు అందిస్తున్న వారికి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసే వెసులుబాటు రాజ్యాంగం కల్పించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా టాలీవుడ్ నుండి విజయేంద్ర ప్రసాద్, కోలీవుడ్ నుండి ఇళయరాజా రాజ్యసభకు ఎంపిక అయ్యారు.
ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమ నుండి రావుగోపాలరావు, హరికృష్ణ, దాసరి నారాయణరావు, మోహన్ బాబు, దగ్గుబాటి వెంకటేశ్వరావు, డా.సి. నారాయణ రెడ్డి, టి. సుబ్బరామిరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్లారు. తాజా గా రచయిత విజయేంద్ర ప్రసాద్ పెద్దల సభకు ఎంపిక అయ్యాడు.

“విజయేంద్ర ప్రసాద్ అందించే కథలు భారతీయ సంస్కృతి ని తెలియజేసే విధంగా ఉంటాయి. విజయేంద్ర ప్రసాద్ రచనలు ఎప్పటికీ చెరగని ముద్ర వేశాయి” అని మోడీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘బాహుబలి'(సిరీస్), ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాలీవుడ్ లో వచ్చిన ‘బజరంగీ భాయిజాన్’ సినిమాలకు కథ అందించాడు.

- Advertisement -

అలాగే ఇళయరాజా పాటల ప్రభావం జనాల పై ఎంత వరకు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి భావోద్వేగాలను వ్యక్తపరచాలి అన్నా, నిద్ర సరిగ్గా పట్టడం లేదు అన్నా, టక్కున గుర్తువచ్చేది ఇళయరాజా పాటలే. కొన్ని దశాబ్దాలుగా ఇళయరాజా సంగీతం ఓ మెడిసిన్ లా కూడా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు