Madhavan: సెకండాఫ్ నచ్చలేదు

అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత విశేషాలను తెలియజేసే “రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్” చిత్రానికి మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను కూడా పోషించారు. దర్శకుడిగా తన మొదటి సినిమానే ప్రేక్షకులు ఆదరించడం పట్ల ఆర్ మాధవన్ ఆనందం వ్యక్తం చేశారు. “రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్” బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాధవన్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మురగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా 2005లో వచ్చిన “గజిని” కోసం దర్శకుడు మొదట మాధవన్‌ని సంప్రదించాడు.

అయితే సెకండాఫ్ కథ నచ్చలేదని మాధవన్ చెప్పాడు. కాబట్టి ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇదిలా ఉంటే.. గజినీలో ఆ పాత్ర తనకంటే సరిపోయే వ్యక్తికి దక్కడం ఆనందంగా ఉందని మాధవన్ అన్నారు. సూర్య లాగా నేను సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తానో లేదో తెలియదు. ఈ క్యారెక్టర్ కోసం సూర్య ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఒక వారం పాటు తన ఆహారంలో ఉప్పును పూర్తిగా మానేశాడు అని చెప్పుకొచ్చారు. రాకెట్రీ సౌత్ ఇండియన్ వెర్షన్లలో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

గజిని తమిళంలో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటి. ఈ సినిమా హిందీ రీమేక్ కూడా 2008లో మురుగదాస్ దర్శకత్వంలోనే విడుదలైంది. ఆ చిత్రంలో అమీర్ ఖాన్ హీరోగా నటించాడు. హిందీ గజిని కూడా భారీ విజయం సాధించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు