థీయేట‌ర్ యాజమాన్యాలతో  వర్మ “డేంజరస్” వార్ !

వర్మ చాలాకాలం నుండి ఊరిస్తూ వస్తున్న వివాదత్మక చిత్రం “డేంజరస్”.  ఈ చిత్రం మొదలు పెట్టినప్పటినుండే, ఒక రకమైన క్రేజ్ ని, పోస్టర్ల ద్వారా తెప్పించేసాడు వర్మ. ఎట్టకేలకు అన్ని పూర్తి చేస్కుని విడుదలకు సిద్దమయిన ఈ చిత్రానికి పి.వి.ఆర్ మరియు ఇనోక్స్ సంస్థలు షాక్ ఇచ్చాయి. 

తమ థియేటర్స్ లో ఇలాంటి చిత్రాలను విడుదల చేసి వచ్చే ప్రేక్షకుల ఇబ్బంది కలిగించాలనుకోవడం లేదని వారి భావన. అయితే ఈ పనికి నొచ్చుకున్న వర్మ ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను తెలియజేసారు. సుప్రీం కోర్టు ఆర్టికల్ 377 కి మరియు దేశంలో ఉన్న ఎల్ జి బి టి కమ్యూనిటీ వారి మనోభావాలు దెబ్బతినే విధంగా వీరి చర్యలు ఉన్నాయంటూ ఆర్ జి వి తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

ఇదంతా తెలిసిన విషయం. ఇప్పుడు కొత్తగా చాల వరకు సినిమా హాళ్ళు, వర్మ డేంజరస్ చిత్రాన్ని ప్రదర్శించడానికి నిరాకరిస్తున్నాయి.  చేసేది లేక, వర్మ చిత్ర విడుదలని వాయిదా వేసాడు. 

- Advertisement -

“మా ఇష్టం DANGEROUS సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా theaters non cooperation దృష్ట్యా సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియ చేస్తాను” అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు