Love me: డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య ” లవ్ మీ ” మూవీ..‌‌ కారణం ఇదే..!

Love me: దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆశిష్. ఇక అతడు హీరోగా నటించిన రెండో మూవీనే లవ్ మీ. శనివారం అనగా నేడు ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. హారర్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమాకు అరుణ్ భీమవరపు డైరెక్షన్ వహిస్తూ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు.

ఇక బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు సమర్పణలో రూపొందిన ఈ మూవీ లో హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగమల్లిడి ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ మూవీ ప్రీమియర్స్ టాక్ విషయానికి వస్తే.. సినిమా స్టోరీ రొటీన్ గా ఉండడంతో నెగిటివ్ టాక్ రావడం మొదలైంది.

vaishnavi-chaitanyas-love-me-movie-receiving-disaster-talk
vaishnavi-chaitanyas-love-me-movie-receiving-disaster-talk

ప్రతి ఒక్కరు చూపించే విధంగానే సినిమా యొక్క కాన్సెప్ట్ ఉండడంతో ఈ మూవీని ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోతున్నారు. దీంతో ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ రావడం మొదలైంది. దయ్యంతో ప్రేమ అనేది కొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ.. సరైన విధంగా ఆ స్టోరీ నీ పండించకపోవడంతో ఈ మూవీ నెగిటివ్ టాప్ ను దక్కించుకోవలసి వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు