V.v.vinayak: “ఆది” అలా మొదలైంది

వివి వినాయక్, కమర్షియల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పిన దర్శకుడు,
తన మొదటి సినిమాతోనే సుమోలు లేపుతూ ఆడియన్స్ కి గూస్బమ్స్ తెప్పించాడు. ఆది సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వివి వినాయక్, అసలు ఆది ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది.? వినాయక్ మొదటి సినిమాగా ఒక కమర్షియల్ సబ్జెక్టు ఎన్నుకోవడానికి కారణం ఏంటి అని తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

అప్పటి వరకు ఈవీవీ సత్యనారాయణ, సాగర్, క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశాడు.ఈ నేపథ్యంలోనే తను కూడా దర్శకుడు కావాలి అనుకుని కథ రెడీ చేసుకున్నాడు.

‘‘మొదట ఎన్టీఆర్ కోసం ఓ ప్రేమకథ సిద్ధం చేసాడు . ఎన్టీఆర్‌కి స్క్రిప్ట్ నచ్చింది కానీ ఆ సమయంలో ప్రేమకథ చేయవద్దని అతని స్నేహితుడు కొడాలి నాని చెప్పాడు. ఆ విషయం తెలియగానే తారక్ ను రెండు రోజులు టైం అడిగి ఆది కథను సిద్ధం చేశారట వినాయక్. స్క్రిప్ట్ రెడీ చేసి ఎన్టీఆర్‌కి చెప్పడం. అది అతనికి బాగా నచ్చడంతో ప్రాజెక్ట్ షూట్ స్టార్ట్ అయిందట.

- Advertisement -

వినాయక్, ఎన్టీఆర్, కొడాలి నాని నిర్మాతగా తర్వాత సాంబ సినిమాను చేసారు. కొడాలి నాని నిర్మించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు