Naga Chaitanya : ఇప్పుడు కోలీవుడ్ స్టార్ తో ?

తమిళ స్టార్ హీరో అజిత్ తెలుగులోనూ అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అజిత్ నటన, యాక్షన్ సీన్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ లో అజిత్ ను చూస్తే సగటు అభిమానికి పూనకం రాకుండా ఉండదు. తలా అంటూ అభిమానులు అజిత్ ను ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. కోలీవుడ్ లో రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ అజిత్ కే ఉంది. అయితే అజిత్ కి తాను పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు అక్కినేని నాగ చైతన్య.

నాగచైతన్య పదేళ్లక్రితం జోష్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు . అయితే ఈ మూవీ చైతన్యకు అంతగా పేరు తీసుకు రాలేదు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా నటించిన “ఏం మాయ చేసావే” మూవీ తో మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీతో పరిచయం అయిన సమంతను రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి మజిలీ సినిమాలో నటించి, హిట్ కొట్టాడు. అయితే తాజాగా “థాంక్యూ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాగచైతన్య.

ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా అజిత్ కి తాను పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అజిత్ – నాగచైతన్య కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నట్లుగా ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అజిత్ తో అక్కినేని నాగార్జున ఇప్పటికే మాట్లాడినట్టు సమాచారం. అయితే దర్శకుడు ఎవరు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేవి త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

నాగ చైతన్య ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా సినిమా చేశాడు. ఇప్పుడు పై వార్త నిజమైతే, కోలీవుడ్ స్టార్ హీరోతో చేస్తాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు