Sudheer Babu : 10న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’

హీరో సుధీర్ బాబు – ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి ‘సమ్మోహనం’. సుధీర్ బాబు- అదితి రావు హైదరీ జంటగా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ ను అందుకుని నిర్మాతలకు స్వల్పంగా లాభాలు కూడా తెచ్చింది. సుధీర్ బాబుకు ప్రేమకథ చిత్రం లాంటి హిట్ ను ఇచ్చింది సమ్మోహనం. రెండో సినిమా ‘వీ’. సుధీర్ బాబు – నానీ మల్టీ స్టారర్ గా ‘వీ’ సినిమా వచ్చింది.

నానీ విలన్ పాత్రలో నటించగా, సుధీర్ బాబు హీరో పాత్రలో కనిపంచాడు. ఇది డైరెక్ట్ ఓటీటీగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో వచ్చింది. దీని తర్వాత సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబో హైట్రిక్ మూవీగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వస్తుంది. ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుంది. షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని, పోస్టు ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

కాగా, ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్ డేట్ వచ్చింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్ డేట్ ను బుధవారం ఉదయం 10 : 07 గంటలకు ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, రేపు ఉదయం అప్ డేట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కాగా రేపు వచ్చే అప్ డేట్ సినిమా రిలీజ్ డేట్ అయి ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు