Naresh-Pavitra Lokesh : వివాదాస్పద జంట పై ట్రోల్స్

సినీ ఇండస్ట్రీలో ఇద్దరి మధ్య మనసులు కలవడం కామన్. కొన్ని జంటలు స్నేహితులుగా మారి, ప్రేమ చిగురించి, పెళ్లి పీటల వరకు వెళ్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇలాంటి వాటివి ప్రేక్షకుల నుండి సపొర్టు కూడా వస్తుంది. అయితే, ఈ మధ్య కాలంలో కలిసిన ఒక జంటపై మాత్రం విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆ జంటనే నరేష్-పవిత్ర లోకేష్.

ఇప్పటికే మూడు పెళ్లిలు చేసుకున్న నరేష్, రెండు పెళ్లిలు పవిత్ర లోకేష్ ప్రేమలో పడటంపై అన్ని వర్గాల నుండి ట్రోల్స్ వస్తున్నాయి. ఈ వ్యవహారం బయటకు వచ్చిన నాటి నుండి పవిత్ర లోకేష్ కు ఆఫర్స్ కూడా తగ్గాయి. అయితే, ఈ జంట ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మొదటి షో నుండే మిక్సిడ్ రివ్యూలు వస్తున్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ రివ్యూలు ఎలా ఉన్నా, ఒక విషయంలో మాత్రం థియేటర్స్ లో ఈలలు, గోలలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అది మాస్ మహా రాజా రవితేజను చూసి అనుకుంటే, తప్పులో కాలు వేసినట్టే. మరి ఇంకెవరిని అనుకుంటున్నారా.. అదేనండి ఈ మధ్య కాలంలో వివాదాస్పద జంటగా పేరు తెచ్చుకున్న నరేష్-పవిత్ర లోకేష్ ను చూసి.

- Advertisement -

రామారావు ఆన్ డ్యూటీ హీరో రవితేజ ఎంట్రీ సీన్ లో గానీ, మాస్ ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు గానీ ఈలలు ఎక్కువగా రావడం లేదు. కానీ, స్క్రీన్ పై పవిత్ర లోకేష్ కనిపించిన ప్రతి సారి ఈలలు ఎక్కువగా వస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఓ స్టార్ హీరో ఎంట్రీ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది థియేటర్స్ లోనే కాదు, ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ పెరిగిపోయాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు