Die Hard Fan : ఫస్ట్ లిరికల్ సాంగ్

శివ ఆల‌పాటి, ప్రియాంక శ‌ర్మ‌ జంట‌గా నటిస్తున్న చిత్రం ‘డై హార్డ్‌ ఫ్యాన్‌’. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్‌ డైరెక్టర్‌ అభిరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టార్ హీరోస్ కి మాత్రమే కాకుండా హీరోయిన్స్ కి కూడా అభిమానులు ఉంటారు.

‘సినిమా లో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. అలాంటి ఓ అభిమాని త‌ను అభిమానించే హీరొయిన్ ని క‌ల‌వాల‌నుకుంటాడు. అనుకొకుండా హీరోయిన్ క‌లిస్తే ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేది ఈ చిత్ర ముఖ్య క‌థాంశం.
హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది.ఈ చిత్రం లో అన్ని పాత్ర‌లు కూడా హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కథలో మలుపులు ప్రేక్షకుడిని థ్రిల్‌ చేస్తాయి’అని చిత్ర యూనిట్‌ ఇదివరకే పేర్కొంది.

ఈ చిత్రానికి మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి అరెరే కుదురే లేదే అనే పాటను విడుదల చేసింది మూవీ టీం. హరిచరణ్ ఈ పాటను ఆలపించగా, లక్ష్మి ప్రియాంక సాహిత్యం అందించారు. ఈ చిత్రంలో షకలక శంకర్‌, రాజీవ్‌ కనకాల, నోయల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన కాన్సెప్ట్‌ మోషన్‌ పోస్టర్‌కి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఆగస్టులో డై హార్డ్‌ ఫ్యాన్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు