Payal Rajput: అరుదైన వ్యాధితో బాధపడుతున్న “ఆర్ఎక్స్100” హీరోయిన్

“ఆర్ఎక్స్100” సినిమాతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుందని విశ్లేషకులు భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పాయల్ కు ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ మూవీ పడలేదు. వెంకీ మామ, డిస్కో రాజా వంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ, ఆ పాత్రలు మాత్రం తన కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు.

ఇక మంచు విష్ణు హీరోగా నటించిన “జిన్నా” అనే మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీలో పాయల్ తో పాటు మరో బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ కూడా కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా హిట్ క్రెడిట్ మొత్తం సన్నీలియోన్ కే వెళ్ళిపోయింది అని చెప్పాలి. అటు సరైన హిట్ లేక, ఇటు కావాల్సినన్ని అవకాశాలు రాక సతమతమవుతున్న ఈ బ్యూటీ ఓ అరుదైన జబ్బుతో బాధపడుతోందట. అయితే అది తన రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.

ప్రస్తుతం ఈ బ్యూటీ రిలీజ్ కు రెడీగా ఉన్న డార్క్ థ్రిల్లర్ “మంగళవారం” సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. “ఆర్ఎక్స్ 100” సినిమాతో పాయల్ కు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తూ ఉండడం విశేషం. అయితే ఈ సినిమాలో పాయల్ ఛాలెంజింగ్ రోల్ పోషిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో పాయల్ ను చూసి ఇది మరో బోల్డ్ కంటెంట్ మూవీ అనుకున్నారు అంతా. ఇక అసలు విషయంలోకి వస్తే ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ నింఫోమానియాక్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుందట. సినిమాలో ఆమె పాత్రను రూపొందించడానికి చిత్ర బృందం కావలసినంత హోంవర్క్ చేసిందట. తన రోల్ కోసం పాయల్ బరువు కూడా తగ్గింది. ఇక పాత్రకు తగినట్లుగానే అందాలు కూడా బాగానే ఆరబోసింది.

- Advertisement -

“మంగళవారం” సినిమాలో పాయల్ రాజపుత్ తో పాటు అజయ్ ఘోష్, నందితా శ్వేత తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా సినిమాపై కావలసినంత బజ్ క్రియేట్ చేసింది. “మంగళవారం” మూవీ నవంబర్ 17న రిలీజ్ కు సిద్ధమవుతుండగా, నవంబర్ 11న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ తో అయినా పాయల్ ఫేట్ మారుతుందేమో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు