The Ghost : మెగాస్టార్ తో పోటీకి సై

‘కింగ్’ నాగార్జున హీరోగా ‘ది ఘోస్ట్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘గరుడవేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో నాగార్జున ఇంటర్పోల్ ఏజెంట్ విక్రమ్ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ నటిస్తుంది. ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి’, ‘నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. అందులో ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ రోజు విజయదశమి సెలవు ఉండడం విశేషం.

అయితే విజయదశమి రోజే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ తో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ వీడియోలో రిలీజ్ డేట్ చెప్పలేదు. విజయదశమి కానుకగా విడుదల చేస్తున్నట్లు మాత్రమే రివీల్ చేశారు. ఈ రెండు సినిమాలు కనుక ఒకే రోజు విడుదలైతే, నాగార్జున సినిమా ఓపెనింగ్స్ పై దెబ్బ పడే అవకాశం ఉంది. చిరంజీవి స్టార్ ఇమేజ్ గురించి అందరికీ తెలిసిన సంగతే. అయితే చిరు సినిమా విజయదశమికి రిలీజ్ అవుతుందని తెలిసి కూడా, నాగార్జున ది ఘోస్ట్ మేకర్స్ విజయదశమికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు