Dil Raju : ఎఫ్ 3కి మించి

మూడేళ్ల ముందు థియేటర్ల కళే వేరు. చిన్న సినిమా వచ్చినా, సినీ లవర్స్ పోటెత్తే వాళ్లు. ఇక పెద్ద సినిమాలకు అయితే, చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల సినిమాలు వస్తే, కనీసం రెండు నుండి మూడు వారాల వరకు థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చేవి. కానీ, ప్రస్తుతం సీన్ మారింది. ఎంత పెద్ద స్టార్ సినిమా వచ్చినా, రెండు, మూడు వారాల్లో థియేటర్ల నుండి వెళ్లిపోతుంది. అప్పటిలాగా, సినీ లవర్స్ థియేటర్స్ రావడం మానేశారు.

దీనికి కారణాలు అనేకం ఉండచ్చు. అందులో ప్రధానంగా ఓటీటీలో ప్రభావం ఒకటి. అలాగే మరొకటి టికెట్ల ధరలు. ఒక సినిమాను ఫ్యామిలీతో చూడాలంటే, కనీసం 2000 రూపాయలకు పైనే ఖర్చు అవుతుంది. కరోనా మహమ్మారి వల్ల అందరి ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి. ఒక్క రోజు 2000 రూపాయలు ఖర్చు చేయడానికి జనాలు రెడీగా లేరు.

అయినా, కొన్ని సినిమాల నిర్మాతలు లాభం కోసం పోటీ పడి మరి టికెట్ల ధరలు పెంచారు. దీంతో సామాన్యులు థియేటర్లకు పూర్తి గా దూరం అయ్యారు. ఇది గమనించిన చిన్న సినిమాల నిర్మాతలు ప్రేక్షకులను ప్రసన్నం చేసుకోవడానికి ప్లాన్లు వేశారు. అందులో నుండి వచ్చిందే. టికెట్ల ధరలను తగ్గించడం. దిల్ రాజు తన ఎఫ్ 3 సినిమా టికెట్ల ధరలను పెంచలేరు. సాధారణ ధరలతోనే టికెట్లను విక్రయించారు. దిల్ రాజు తీసుకున్న నిర్ణయం తర్వాత చాలా మంది నిర్మాతలు ధరలను తగ్గించారు.

- Advertisement -

మళ్లీ ఇప్పుడు థాంక్యూ సినిమాకు కూడా అదే స్ట్రాటజీ వాడుతున్నాడు దిల్ రాజు. అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న థాంక్యూ ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ సినిమాకు దిల్ రాజు టికెట్ల ధరలను కొంత మేర తగ్గించాడు. సింగిల్ స్క్రీన్‌లకు టికెట్ ధర 100 రూపాయలు. మల్టీప్లెక్స్‌లకు 150 రూపాయలు. దీనికి అదనంగా జీఎస్టీ ఉంటుదని దిల్ రాజు వెల్లడించాడు. దీంతో సామాన్యలను కూడా థియేటర్ కు వస్తారని దిల్ రాజు అభిప్రాయపడుతున్నాడు. మరి దిల్ రాజు ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో తెలియాలంటే, ఈ నెల 22 వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు