Sudha Kongara: మల్టి స్టారర్

గురు సినిమాతో తెలుగులో తనదైన ముద్రను వేసుకుని ఒక డైరెక్టర్ గా మంచి పేరును సాధించుకుంది సుధా కొంగర. తరువాత సూర్య తో చేసిన ఆకాశమే హద్దురా సినిమా సుధా కు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం సుధా కొంగర హోంబాలే ఫిలిమ్స్ లో తన తదుపరి చిత్రాన్ని చేయనున్న విషయం తెలిసిందే. హోంబాలే ఫిలింస్ బ్యానర్ నెమ్మదిగా ఇతర భాషల్లోకి అడుగుపెట్టి సినిమా నిర్మాణంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. కెజిఎఫ్‌ సినిమాతో ఈ ప్రొడక్షన్ హౌస్ అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంది. ఇప్పుడు ఈ బ్యానర్ సౌత్ నుండి ముగ్గురు పెద్ద స్టార్స్‌తో ఒక మల్టీస్టారర్‌ను ప్లాన్ చేస్తోంది.

మల్టీస్టారర్ కోసం నటీనటులు దుల్కర్ సల్మాన్, సూర్య, నానిలతో ప్రొడక్షన్ హౌస్ చర్చలు జరుపుతోందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. నటీనటుల కోసం ఓ ప్రత్యేకమైన సబ్జెక్ట్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించబోతున్నారు. ఆకాశమే నీ హద్దు రా సినిమాతో హిట్ కొట్టిన సుధ ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది. ప్రాజెక్ట్ ను ఇదివరకే ప్రకటించారు. కానీ నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు