Jr NTR’s Devara Update: తారక్ బర్త్ డే ట్రీట్… దీనిలో ఓ ట్విస్ట్ ఉంది గురు..!

Jr NTR’s Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అందాల అతిలోక సుందరి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.

ఈ సినిమాతోనే జాన్వి టాలీవుడ్ కి పరిచయం కానుంది. ఇక త్రిబుల్ ఆర్ అనంతరం ఎన్టీఆర్ చేసే సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఇతర అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఎన్టీఆర్ బర్తడే వస్తున్న సంగతి తెలిసిందే. మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఇంకా తారక్ పుట్టినరోజు కి ఐదు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది.

Tarak's birthday treat... with a twist Thursday
Tarak’s birthday treat… with a twist Thursday

ఇక తారక్ బర్తడే సందర్భంగా దేవర నుంచి టైటిల్ సాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఎడిటింగ్ వర్క్ అవ్వకపోతే ప్రోమో రావచ్చు. గత కొంతకాలంగా సాంగ్ వస్తుందని ప్రచారం జరిగింది. కానీ సాంగ్ ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వలేదట. దీంతో తారక్ బర్తడే రోజు జస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తారక్ బర్తడే కి దేవరా నుంచి మంచి సాంగ్ ని రిలీజ్ చేస్తారని తన ఫ్యాన్స్ ఎంతగానో ఆరాటపడుతున్నారు. కానీ ఎడిటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో సాంగ్ ప్రోమోతో సరిపెట్టేయనున్నట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు