Mahesh Babu: జక్కన్న కోసం మహేష్ కసరత్తులు.. కొత్త లుక్ అదుర్స్..!

Mahesh Babu: రాజమౌళి.. టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేని పేరు. ఈయన సినిమా అంటే దాదాపు కొన్ని కోట్లు ఖర్చవుతాయి. దానికి ఫలితంగా సినిమా అవుట్ ఫుట్ కూడా అదే విధంగా ఉంటుంది. కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతుంది. అంతేకాకుండా ఫ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకొస్తుంది అన్న నమ్మకం అందరిలోనూ ఉంటుంది.

అయితే దీనికి ముందు రాజమౌళి పడే కష్టం పెట్టే టార్చర్ ఆ సినిమాలో వర్క్ చేసే స్టార్ హీరోలకి మాత్రమే తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు బయటపెట్టారు. ఇక ప్రస్తుతం జక్కన్న.. మహేష్ బాబు తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రాజమౌళి బాగా కష్టపడుతున్నారు. అంతేకాకుండా మహేష్ బాబును కూడా బాగానే కష్టపెడుతున్నాడు. తాజాగా మహేష్ బాబు తెలంగాణలో ఓటుహక్కును వినియోగించుకునేందుకు వెళ్లారు.

Mahesh's workouts for Jakkanna.. new look adurs
Mahesh’s workouts for Jakkanna.. new look adurs

ఈ క్రమంలోనే ఆయన కొత్త లుక్ వైరల్ అవుతుంది. చాలా హ్యాండ్సమ్ స్టైలిష్ గా యంగ్ లుక్ లో అదిరిపోయే లాగా కనిపించాడు మహేష్ బాబు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు.. జక్కన్న సినిమా కోసం భారీ వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ కోసం మహేష్ 12 కేజీల బరువు తగ్గడం. ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు