Tamil Directors : నిర్మాతలుగా మారుతున్న తమిళ దర్శకులు… మాస్ ప్లానింగ్

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి… అనే సామెతను సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సెలబ్రిటీలు తూచా తప్పకుండా పాటిస్తారు. తమకున్న పాపులారిటీని వీలైనంత ఎక్కువగా క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ప్రస్తుతం తమిళ దర్శకులు కూడా ఇదే చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల విషయంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్నారు. లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి యంగ్ డైరెక్టర్స్ కి ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్లతో పాటు పలువురు సీనియర్ హీరోలు కూడా తమకు ఇప్పుడున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. అందుకే దర్శకత్వంతో పాటు నిర్మాతలుగా కూడా మారి ఫామ్ లో ఉండగానే నాలుగు రాళ్లు వెనక వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్ నిజానికి పెద్దగానే ఉంది. మరి దర్శకత్వం చేస్తూనే నిర్మాతలుగా కూడా మారిన ఆ డైరెక్టర్స్ ఎవరెవరు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

1. అట్లీ
గత ఏడాది “జవాన్” సినిమాతో కింగ్ ఖాన్ షారుక్ కు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు డైరెక్టర్ అట్లీ. ఈ మూవీ దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అయితే ఇప్పుడు అట్లీ నిర్మాతగా కూడా బిజీ అవుతున్నాడు. నిజానికి ఆయన నిర్మాతగా మారి ఇప్పటికే పలు తమిళ సినిమాలను నిర్మించాడు. కానీ ఇప్పుడు ఏకంగా ఓ బాలీవుడ్ మూవీని నిర్మిస్తున్నారు. ఇలా ఆయన అన్ని భాషల్లో సినిమాలు నిర్మించి పాన్ ఇండియా నిర్మాతగా మారతారేమో మరి.

2. విగ్నేష్ శివన్
మరో కోలీవుడ్ యంగ్ డైరెక్టర్, లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విగ్నేష్ శివన్ కూడా ఓవైపు దర్శకత్వం వహిస్తూనే, మరోవైపు రౌడీ పిక్చర్స్ అనే బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయన డైరెక్టర్ గా కంటే నిర్మాతగానే ఎక్కువగా బిజీగా ఉన్నారు.

- Advertisement -

3. నెల్సన్ దిలీప్ కుమార్
రీసెంట్ గా “జైలర్’ మూవీతో సూపర్ స్టార్ రజినికాంత్ కు సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఈయన కూడా నిర్మాతగా మారబోతున్నట్టుగా ప్రకటించారు.

4. లోకేష్ కనగరాజ్
కోలీవుడ్ లోని మరో సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా నిర్మాతగా మారారు. విక్రమ్, లియో వంటి సినిమాలతో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని భావించారు. అందులో భాగంగానే జీ క్వాడ్ అనే బ్యానర్ ను లాంచ్ చేసి, దాని ద్వారా తన అసిస్టెంట్స్ ను డైరెక్టర్స్ గా పరిచయం చేయబోతున్నారు.

5. శంకర్
యంగ్ డైరెక్టర్స్ తో పాటు సీనియర్ దర్శకులు కూడా నిర్మాతలుగా మారి రెండు చేతులా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు డైరెక్టర్ గా భారీ చిత్రాలను రూపొందిస్తున్న శంకర్ నిర్మాతగా యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుండడం విశేషం.

6. మణిరత్నం
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతోమంది స్టార్స్ తహతహలాడుతుంటారు. ఇప్పుడు ఆయన కూడా దర్శకత్వ భాద్యతలతో పాటు, నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. అయితే మణిరత్నం కేవలం తాను దర్శకత్వం వహించే సినిమాలను మాత్రమే నిర్మిస్తున్నారు

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు