Suriya : తెరపైకి అదిరిపోయే సీక్వెల్

సీక్వెల్, ఇండస్ట్రీ ఏదైనా, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇదే వినిపిస్తుంది. సినిమాలు చేయడానికి కథలు లేకపోవడమో, లేదా మొదటి సినిమా బిగ్ హిట్ వచ్చిందని కారణమో తెలియదు కానీ, ప్రస్తుతం సీక్వెల్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే కార్తికేయా-2, హిట్ -2, డీజే టిల్లు-2, పుష్ప -2, చంద్రముఖి-2 తో పాటు చాలా సినిమాలు సీక్వెల్ గా తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు మరో సీక్వెల్ తెర పైకి వచ్చింది.

సూర్య హీరోగా, తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన అద్భుత చిత్రాల్లో 24 ఒకటి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా సూర్య మూడు విభిన్న పాత్రలో కనిపించాడు. తండ్రి, కొడుకుతో పాటు విలన్ పాత్రలో ఒక హీరో కనిపించడం అదే మొదటి సారి. ఈ ప్రయోగం చాలా వరకు సక్సెస్ అయింది. సూర్య కు 100 కోట్ల సాదించి పెట్టిన సినిమాల్లో ఇది కూడా ఒక్కటి.

ఇదిలా ఉండగా, ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే రాబోతుందట. ఈ విషయాన్ని డైరెక్టర్ విక్రమ్ కుమార్ అధికారికంగా ప్రకటించాడు. థాంక్యూ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు సమాధానంగా, 24కు సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశాడు.

- Advertisement -

సూర్య కనిపించ ప్రతి పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గర అయిందని తెలిపాడు. దీనికి మించిన కథను రెడీ చేసినట్టు తెలిపాడు. త్వరలోనే పూర్తి వివరాలను కూడా వెల్లడిస్తానని ప్రకటించాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు