Gautham Vasudev Menon: మేజర్ సెల్వన్ పాత్రలో

దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘సీతా రామం’. దుల్కర్ సరసన కథానాయిక గా మృణాల్ ఠక్కర్ నటిస్తుంది. ఈ చిత్రంలో దుల్కర్ సైనికుడిగా నటిస్తున్నాడు. సీతా రామం చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకే సీతా రామం నుండి రిలీజైన టీజర్,పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నతో పాటు, హీరో సుమంత్ ఇందులో ఓ కీలక పాత్రను పోషించాడు. అలానే ఇప్పుడు గౌతమ్ వాసుదేవ మీనన్ పోషిస్తున్న పాత్రను చిత్రబృందం రివీల్ చేసింది. ఇందులో మేజర్ సెల్వన్ పాత్రను గౌతమ్ పోషిస్తున్నారు. గౌతమ్ మీనన్ అద్భుతమైన లవ్ స్టోరీస్ ను తెరకెక్కించడమే కాకుండా. ఈ మధ్య కొన్ని సినిమాలలో తన అద్భుతమైన నటనను కనబరుస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది కనులు కనులను దోచాయంటే, ట్రాన్స్ వంటి సినిమాలలో కనిపించిన గౌతమ్ ప్రస్తుతం సీతా రామం లో కనిపించనున్నారు.

ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ సంస్థలో అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ మూవీను ఆగస్ట్ 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. 1965 యుద్ధ నేపధ్యంలో ప్రేమకావ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు హను రాఘవపూడి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు