Suriya : ఆ సినిమా ఆగిపోయిందా..?

ప్రతీ ఇండస్ట్రీలో స్టార్ కాంబినేషన్ ఉంటుంది. కలిసొచ్చే హీరోలను డైరెక్టర్లు అంటిపెట్టుకుని ఉంటారు. వారితోనే వరుసగా సినిమాలు చేస్తుంటారు. అలాంటి స్టార్ కాంబో గురించి చెప్పుకోవాల్సి వస్తే, కోలీవుడ్ లో ముందుగా గుర్తుకువచ్చేది.. సూర్య – బాలా. తమిళ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా ఉన్న బాలా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

ఆయన తెరకెక్కించిన సినిమాలు తెలుగు ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకున్నాయి. అలాగే సూర్య – బాలా కాంబోలో వచ్చిన నంద, శివ పుత్రుడు, మాయావి లాంటి సినిమాలు తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. దీంతో వీరి కాంబోలో సినిమా వస్తుందంటే, అంచనాలు కాస్త భారీగానే ఉంటాయి.

కాగా, సూర్య తన 41 సినిమాకు బాలా నే దర్శకత్వం వహిస్తున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ప్రస్తుతం ఈ సినిమా గురించి కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఆగిపోయిందని, మళ్లీ స్టార్ట్ కాదని సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుంది.

- Advertisement -

అయితే ఈ సినిమా ఆగిపోలేదని, తాత్కాలికంగా వాయిదా మాత్రమే పడిందని ఈ సినిమా నిర్మణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్ అధికారికంగా ప్రకటించింది. డైరెక్టర్ బాలా స్క్రిప్ట్ విషయంలో కాస్త మార్పులు చేస్తున్నాడని, అందుకే ఈ సినిమా ఆలస్యమవుతుందని తెలిపింది. ప్రస్తుతం సూర్య సింగం సిరీస్ డైరెక్టర్ హరితో ఓ చేస్తున్నాడు. దీని తర్వాత బాలాతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు