Suriya 42 : సెన్షషనల్ విజువల్స్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య దక్షిణాదిలోనే అత్యధిక పారితోషకం తీసుకునే హీరోల్లో ఒకరు. అతను టాలీవుడ్ లో కూడా అగ్ర హీరోల పేరు తెచ్చుకున్నాడు. బలమైన అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా సూర్యకి మంచి పేరు ఉంది. ఇప్పుడు తన కెరీర్ లో సాలిడ్ లైనఫ్ ని సెట్ చేసుకున్న విషయం విధితమే. అదేవిధంగా తన కెరీర్ లో 42వ సినిమాని దర్శకుడు శివతో చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. 

ఆ సినిమాని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచే అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఈ మోషన్ పోస్టర్ ఊహించని విధంగా సెన్షేషనల్ విజువల్స్ తో ఉంది. అదేవిధంగా దేవీ శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ మోషన్ పోస్టర్ ను చూస్తుంటే చారిత్రక నేపథ్యంలో తెరకెక్కే సినిమాగా కనిపిస్తోంది. ఈ  సినిమా లో సూర్య సరికొత్తగా కనిపించాడు. సూర్య  ఇలాంటి లుక్ లో ఇప్పటి వరకు కనిపించలేడు. ఒక రాజ్యానికి రాజుగా, యుద్ధం చేసే వీరుడిలా కనిపిస్తున్నాడు. 

మోషన్ పోస్టర్ ప్రారంభంలో ఒక పక్షి ఎగురుతూ.. వచ్చి చివరికి సూర్య మీద వాలుతుంది. ఇది కూడా ఒక రకంగా ఇంట్రెస్ట్ గా ఉంది. సినిమా స్టోరీ, నేపథ్యం వంటివి చెప్పకుండానే ఒక మోషన్ పోస్టర్ తోనే ఈ సినిమాపై సినీ ప్రేమికుల్లో అంచనాలను మేకర్స్ భారీగా పెంచారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం దాదాపు దాదాపు 10 భాషల్లో విడుదల చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.     సూర్యకి ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుందనే చెప్పవచ్చు.  

- Advertisement -

 

 

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు