SuperStar Krishna : “నా పనైపోయిందని పక్కన పెట్టారు”

సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు మే 31న కావడంతో ఆమె కుమార్తె మంజుల తన యూట్యూబ్ ఛానల్ కోసం ఆయనతో ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది.దానికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో కృష్ణగారు బోలెడన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అలాగే ఆయన సినీ కెరీర్లో ఎదుర్కొన్న బ్యాడ్ ఫేస్ గురించి కూడా వివరించారు. అయితే ఆయన టాప్ హీరోగా కొనసాగుతున్న టైంలో ఆయనకి 12 ప్లాపులు పడ్డాయట. ‘పాడిపంటలు’ చిత్రానికి ముందు విడుదలైన 12 సినిమాలు ప్లాపులని ఆయన చెప్పుకొచ్చారు.

దాంతో కృష్ణ ఇక హీరోగా పనికిరారు అని దర్శక నిర్మాతలు భావించి ఆయన్ని పక్కన పెట్టేశారట. ఈ క్రమంలో ఆయన తన సోదరుడు ఆదిశేషగిరిరావు ను నిర్మాతగా పరిచయం చేస్తూ సొంత బ్యానర్లో ‘పాడిపంటలు’ అనే సినిమా చేసినట్టు చెప్పుకొచ్చారు కృష్ణ. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిందట.

కృష్ణ గారికి మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టిన మూవీ అది.ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. కొన్ని సినిమాలకి దర్శకత్వం వహించారు. అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలాగే కృష్ణగారి కూతురు మంజులని టాప్ హీరో సినిమాలో హీరోయిన్ గా అనుకున్నప్పుడు పెద్ద గొడవలు అయ్యాయట. ఈ విషయం పై కూడా కృష్ణ స్పందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు