Super Star: హీరోగా పనికిరావన్నారు.. కానీ ఏడాదిలోనే 25 హిట్స్..!

Super Star.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో విజయాలను అందుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎంతోమంది పరితపిస్తూ ఉంటారు.. అయితే అలా వచ్చిన వారు ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే పట్టుదల , కృషి ఎక్కువయి ఆ స్థాయికి చేరుకుంటారు.. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి జీవితంలో అనుకున్న దానికి మించి సాధించి చూపించడమే కాదు.. ఏకంగా ఒకే ఏడాది 25 హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నా..రు మరి ఆ స్టార్ హీరో ఎవరు ?ఆయన పడ్డ అనుమానాలు ఎటువంటివి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

అవమానాలు పడ్డచోటే సక్సెస్..

Super Star: He was useless as a hero.. but 25 hits in a year..!
Super Star: He was useless as a hero.. but 25 hits in a year..!

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే కొంతమందికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.. ఇప్పుడు టాప్ సెలబ్రిటీలు గా మారిన కొంతమంది తారలు ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించిన వారే.. ఇక అలా కెరియర్ తొలినాళ్లలో మాటల్లో చెప్పుకోలేని అవమానాలు భరించారు. అయితే ఒక వ్యక్తికి ఆడిషన్ టెస్ట్ లో 100కు రెండు మార్కులే వేశారు . అందంగా లేవని సినిమాల్లో అవకాశాలు కూడా ఇవ్వలేదు. అయితే ఇలాంటి స్టేజ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి జీవితంలో అనుకున్న దానికి మించి సాధించి చూపించారు అంతేకాదు ఏకంగా ఒకే ఏడాదిలోని 25 హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు.ఆయన ఎవరో కాదు మలయాళీ సూపర్ స్టార్ మోహన్లాల్.

మోహన్ లాల్ పేరు ఎవరిదంటే..

ఈయన మలయాళం తో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ వంటి భాషల్లో నటించారు . ఇండియాలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో అని ఈయన కూడా ఒకరు. ఇటీవల 64వ పుట్టినరోజు జరుపుకున్న ఈయన సినీ ప్రయాణం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 1960 మే 21న కేరళలోని పతనం తిట్ట జిల్లాలోని ఎలంతూరు అనే ఊరిలో జన్మించారు. మోహన్లాల్ ఆయన తండ్రి విశ్వనాథన్ న యర్ కేరళ ప్రభుత్వంలో బ్యూరోక్రాట్ ఇంకా కూడా పనిచేశారు న్యాయ కార్యదర్శిగా కూడా విధులు నిర్వహించారు. ఈయన పెద్దన్నయ్య ప్యారేలాల్ 2000 వ సంవత్సరంలో మిలిటరీ ఎక్ససైజ్ లో చనిపోయాడు.. ఇక మోహన్ లాల్ కు తన మామయ్య పేరు పెట్టారు.. తండ్రి వారి ఇంటిపేరు లాయర్ను మోహన్లాల్ పేరుతో వాడకూడదని నిర్ణయించారు .

- Advertisement -

ఒకే ఏడాది 34 అందులో 25 బంపర్ హిట్..

ఆ తర్వాత 1978లో తిరనోత్తం అనే సినిమాలో మానసికంగా ఎదగని సర్వెంట్ క్యారెక్టర్ లో నటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా 25 యేళ్లు విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత 1980లో ఫాజిల్ దర్శకత్వం వహించిన మంజుల విరంజ పుక్కల్ అనే సినిమాలో విలన్ గా కేవలం రూ.7,00,000 బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా కోటి రూపాయలు లాభం అందుకుంది.. ఈ మూవీ ఆఫర్ కోసం స్నేహితులు మోహన్ లాల్ దరఖాస్తును నవోదయ స్టూడియోకి పంపారు అడిషన్లో కొంతమంది ఈయన రూపాన్ని చూసి ఇష్టపడలేదు. అప్పుడు 100కు రెండు మార్కులే ఇచ్చారు. కానీ ఫాజిల్, ప్రొడ్యూసర్ అప్పార్చను మాత్రం ఈయనకు ఎక్కువ మార్కులు ఇచ్చి తమ సినిమాల్లో పెట్టుకున్నారు .. ఇక అనుకున్నట్టుగానే ఆయన తన టాలెంట్ను ఉపయోగించి భారీ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. స్టార్‌డమ్‌ వచ్చిన తర్వాత 1986లో 15 రోజులకు ఒక సినిమా విడుదల అయ్యేది అలా 1986 లోనే ఏకంగా 34 సినిమాలలో నటించి విడుదల చేసి .. రికార్డు సృష్టించాడు. అందులో 25 సినిమాలు బంపర్ హిట్ కావడం విశేషం. ఇక తర్వాత ఏడాదికి 20 సినిమాలు చేస్తూ వచ్చారు మోహన్ లాల్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు