Stars House Rent : ఇళ్లను అద్దెకిచ్చి లక్షల్లో సంపాదిస్తున్న స్టార్స్… ఒక్కొక్కరూ ఎంత రెంట్ వసూలు చేస్తున్నారంటే?

Stars House Rent : సెలబ్రిటీల సంపాదన ఎలా ఉంటుందో చాలామందికి తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూ కోట్లలో వసూలు చేస్తారు. అలాగే యాడ్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యాపారాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తారు. అయితే సెలబ్రిటీల హౌజ్ అద్దె కూడా భారీగానే ఉంటుంది. అంటే వాళ్లు అద్దెకు ఉండడం గురించి కాదు… వాళ్ల ఇంటిని అద్దెకివ్వడం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. బాలీవుడ్ లో పలువురు బడా హీరోలు ఇంటి రెంట్ ద్వారానే లక్షలు కమాయిస్తున్నారు. మరి ఒక్కొక్కరు ఎంత రెంట్ వసూలు చేస్తున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే….

అమితాబ్

ముందుగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుకోవాలి. ఓ డూప్లెక్స్ అపార్ట్మెంట్ ద్వారా ఆయన ఏకంగా నెలకు 10 లక్షల రూపాయలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇక ఆ ఇంటిని అద్దెకు తీసుకుంది మరెవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.

సైఫ్ అలీ ఖాన్

ఆ తర్వాత చెప్పుకోవాల్సింది బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీఖాన్ గురించి. ఆయన బాంద్రాలో ఉన్న తన అపార్ట్మెంట్ ను అద్దెకు ఇచ్చి నెలకు 3.5 లక్షలు సంపాదిస్తున్నాడు.

- Advertisement -

ప్రియాంక చోప్రా

ఇక ఈ లిస్టులో ఉన్న టాప్ స్టార్స్ లో హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఒకరు. ఈ గ్లోబల్ బ్యూటీ విదేశాల్లో సెటిల్ అయినప్పటికీ ఆమెకి ఇక్కడ కూడా భారీగానే ఆస్తులు ఉన్నాయి. అందులో పూణేలో ఉన్న విలాసవంతమైన బంగాళా కూడా ఒకటి. ఈ బంగ్లా ద్వారా ఆమె నెలకు 2 లక్షల రూపాయల అద్దె వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మలైకా అరోరా

ఈ లిస్ట్ లో ఉన్న మరో టాప్ హీరోయిన్ మలైకా అరోరా. బాంద్రాలొని తన లగ్జరీ అపార్ట్మెంట్ ని రీసెంట్ గా కాస్ట్యూమ్ డిజైనర్ కాశీష్ హన్స్ కు మూడేళ్ల పాటు అద్దెకిచ్చింది. ఇక ఈ అపార్ట్మెంట్ కు మలైకా ప్రతినెల అద్దెగా 1.57 లక్షలు వసూలు చేస్తోంది. వీళ్లిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం ఈ అద్దె 5% పెరుగుతుంది. మీడియా కథనాల ప్రకారం ఫస్ట్ ఇయర్ రెంట్ 1.5 లక్షలు, రెండవ ఏడాది నెలకు 1.57 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది డిజైనర్. అంతేకాదు 4.5 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది అద్దె తీసుకున్న వాళ్లు. అంటే మూడేళ్లలో డిజైనర్ దాదాపు 56 లక్షలు మలైకాకు చెల్లిస్తున్నట్లు లెక్క.

రణబీర్ కపూర్

మరో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కు కూడా ముంబై, పూణే లాంటి ప్లేస్ లలో భారీగానే ఆస్తులు ఉన్నాయి. అయితే ఆయన పూణేలో ఉన్న ట్రంప్ టవర్ లో ఉన్న ఫ్లాట్ ని అద్దెకిచ్చి నెలకి దాదాపు 4 లక్షల రూపాయలు రెంట్ వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా బాంద్రాలోని ఒక అపార్ట్మెంట్ ను అద్దెకు ఇచ్చి, దానికి రెంట్ గా దాదాపు 1.5 లక్షలు వసూలు చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఎవరైనా ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకోవాలంటే ముందుగా 4 నుంచి 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు