Suma : స్టార్ యాంకర్ కు అరుదైన వ్యాధి ?

బుల్లితెర పై స్టార్ యాంకర్ గా రాణిస్తున్న వారిలో సుమ టాప్. ఒక్క బుల్లితెర పై అనే కాదు, టాలీవుడ్ లో ఏ సినిమా వేడుకలు జరగాలి అన్నా, సుమ వ్యాఖ్యాతగా ఉండాల్సిందే. అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా వేడుక అయినా సరే ! సుమ కాకుండా వేరే యాంకర్ చేస్తే ఆ వేడుకకు ఆ కళ రాదు. చెప్పుకోవడానికి సుమ మలయాళీ అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యాంకర్ల కంటే కూడా తెలుగు అత్యద్భుతంగా మాట్లాడగలదు. సుమ మొన్నామధ్య ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా చేస్తే ఎంతమంది స్టార్లు వచ్చి ఆ సినిమాను ప్రమోట్ చేసారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి సినిమా వేడుకలకు తక్కువగా హాజరయ్యే పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఆ సినిమా ప్రమోషన్ కు తన వంతు సాయం చేశాడు.

ఇవన్నీ పక్కన పెడితే సుమకు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటి అంటే, సుమ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఈ విషయాన్ని స్వయంగా సుమ తెలియజేసినట్టు వినికిడి. విషయంలోకి వెళ్తే, కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్‌తో సుమ బాధపడుతుందట. అంటే ఇలాంటి వ్యాధితో పాదపడేవాళ్ళకు మొహం పై ఏమైనా చిన్న ఎలర్జి వస్తే, అది త్వరగా తగ్గదు. ఒకవేళ తగ్గినా దాని తాలూకు మచ్చలు త్వరగా పోవు. సుమ కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుందట. మేకప్ ఎక్కువగా వేసుకునే వాళ్లకు ఇలాంటి ప్రాబ్లమ్ వస్తుంది. సుమకు కూడా ఆ కారణం వల్లే వచ్చింది అని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు