Kalki 2898AD : చాలా పెద్ద ప్లానే ఇది

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించడమే కాకుండా దర్శకుడుగా నాగ్ అశ్విన్ కి మంచి పేరును తీసుకొచ్చింది. మనిషిలోని వ్యక్తిత్వాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించాడు. ఈ సినిమాలో నానితో పాటు విజయ్ దేవరకొండ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు. చాలామందికి విజయ్ దేవరకొండ చేసిన రిషి పాత్ర ఇప్పటికీ ఒక ప్రత్యేకమని చెప్పొచ్చు.

ఇక నాగ్ అశ్విన్ చేసిన రెండవ సినిమా మహానటి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదట మహానటి సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు అన్నప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. సావిత్రి గారి బయోపిక్ లో మొత్తం ట్రాజెడీయే ఉంది. ఈ కథతో సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతుందని చాలామంది భావించారు. కానీ ఈ సినిమా ఊహించిన సక్సెస్ ను అందుకుంది.

ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నుంచి విమర్శలను ఫేస్ చేసింది. మహానటిగా సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ని తీసుకుంటున్నారు అన్నప్పుడు ఈ విమర్శలు మరి కాస్త ఎక్కువ అయ్యాయి. కానీ వీటన్నిటికీ ఫస్ట్ లుక్ తోనే ఫుల్ స్టాప్ పెట్టాడు అశ్విన్. ఇకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. థియేటర్ కు జనాలను లాక్కొచ్చింది. మహానటి సావిత్రి కథను అంత బాగా చెప్పాడు దర్శకుడు.

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి.
ఇది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమా పైన బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఇదివరకే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ ని అందించాడు దర్శకుడు. ఈ సినిమా మహాభారతం దగ్గర స్టార్ట్ అయి 2989 వ సవంత్సరం దగ్గర ఎండ్ అవుతుందంటూ చెప్పుకొచ్చాడు. అంటే దాదాపుగా 6000 సంవత్సరాల పిరియడ్ ను ఈ సినిమాలో చూపించినున్నట్లు అప్డేట్ అందించాడు. ఇది ఊహించడానికే అద్భుతంగా అనిపిస్తుంది. అలాంటిది తెరపైన చూస్తే ఎంత బాగుంటుందో అని చాలామంది, చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు